హీరోయిన్ కీర్తి సురేష్ గత ఏడాది డిసెంబర్ లో వివాహం చేసుకుంది. తన చిన్ననాటి స్నేహితుడు ఆంటోనీని హిందూ, క్రిష్టియన్ సంప్రదాయంలో వివాహం చేసుకుంది. ఆతర్వాత కూడా కీర్తి సురేష్ సోషల్ మీడియాలో హీటెక్కించే ఫొటోస్ వదులుతూ చాల యాక్టీవ్ గా కనిపించింది.
హిందీలో బేబీ జాన్ తర్వాత మరో క్రేజీ ప్రాజెక్ట్ కీర్తి సురేష్ ని వరించింది అనే న్యూస్ ఉంది. మరోపక్క కొద్దిరోజులుగా సోషల్ మీడియాకి గ్యాప్ ఇచ్చిన కీర్తి సురేష్ తాజాగా దుబాయ్ డైరీస్ అంటూ కిర్రాక్ లుక్ లో అదిరిపోయే ఫోటోలకు ఫోజులిచ్చింది. రెడ్ సిల్క్ శారీ లో స్లీవ్ లెస్ బ్లౌజ్ తో కీర్తి సురేష్ బ్యూటిఫుల్ లుక్ లో కనిపించింది.
వివాహం అయ్యాక మరింత బ్రైట్ గా వెలిగిపోతున్న కీర్తి సురేష్ గ్లామర్ లుక్స్ మాత్రం యూత్ ని దాటిపోవట్లేదు. ఒకప్పుడు బొద్దుగా కనబడిన కీర్తి సురేష్ ఇప్పుడు స్లిమ్ గా మారిపోయింది. నాజూకైన గ్లామర్ తో మత్తెక్కిస్తుంది. క్రేజీ గ్లామర్ తో అందరి చూపు తనవైపు ఉండేలా చూసుకోవడంలో సక్సెస్ అవుతుంది.