యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ తో ఎప్పుడెప్పుడు సినిమా చేస్తారా అని ఎన్టీఆర్ అభిమానులు దేవర నుంచే వెయిట్ చేస్తున్నారు. రెండేళ్ల క్రితమే ఎన్టీఆర్ బర్త్ డే కి ప్రశాంత్ నీల్ ఫస్ట్ లుక్ వదిలారు. అది పట్టాలెక్కడానికి రెండేళ్లకు పైగానే సమయం పట్టింది. సరే ఎన్టీఆర్-నీల్ షూటింగ్ షురూ అయ్యింది, ఇక ఎన్టీఆర్ బర్త్ డే కి స్పెషల్ ట్రీట్ ఉంటుంది అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆశపడ్డారు.
కానీ ఎన్టీఆర్ హిందీ డెబ్యూ వార్ 2 అప్ డేట్ కోసం NTR-Neel అప్ డేట్ పోస్ట్ పోన్ చెయ్యడం మాత్రం అభిమానులకు నచ్చడం లేదు, బర్త్ డే కన్నా మంచి అకేషన్ ఏముంటుంది, రెండు మూడు ట్రీట్స్ వస్తే నష్టం ఏముంటుంది, సోషల్ మీడియా మొత్తం హడావిడి చెయ్యొచ్చు, వార్ 2 కోసం డ్రాగన్ ట్రీట్ ఆపడమేమిటి అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ గగ్గోలు పెడుతున్నారు.
మరోసారి ఎన్టీఆర్-నీల్ స్పెషల్ గ్లింప్స్ ఇస్తామని చెబుతున్నారు. ఆగష్టు వరకు ఫెస్టివల్స్ కూడా ఏమి లేవు, ఈ మద్యలో పనిగట్టుకుని అప్ డేట్ ఇవ్వరు, ఎన్టీఆర్ బర్త్ డే ని వదులుకోవడం మూర్ఖత్వమే అవుతుంది అంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. అది చూసిన నెటిజెన్స్ ఎలాగోలా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూల్ చెయ్యండయ్యా అంటూ కామెంట్లు పెడుతున్నారు.