సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ హ్యాట్రిక్ సినిమాల తర్వాత సౌత్ లో సెటిల్ అవుతుంది అనుకుంటే.. అమ్మడుకి టాలీవుడ్ అవకాశాలు మాత్రం ఆచితూచి వస్తున్నాయి. అడవి శేష్ తో డెకాయిట్ లో నటిస్తున్నా మృణాల్ ఠాకూర్ కి ఆ ప్రోజెక్టు షాకివ్వదు కదా అని అందరూ మాట్లాడుకుంటున్నారు, ఎందుకంటే అడివి శేష్ ఆ ప్రాజెక్ట్ ని ఆపేసాడనే టాక్ వినబడుతుంది.
ఇక బాలీవుడ్ లో నటిస్తున్న మృణాల్ ఠాకూర్ పేరు ఈ మధ్యన అల్లు అర్జున-అట్లీ ప్రాజెక్ట్ లో బాగా వినబడుతుంది. #AA 22లో అల్లు అర్జున్ సరసన వన్ ఆఫ్ ద హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ పేరు పరిశీలనలో ఉంది అన్నారు, అది నిజమా, కాదా అనేది అధికారిక ప్రకటన వస్తే కానీ క్లారిటీ రాదు.
సోషల్ మీడియాలో యాక్టీవ్ గా కనిపించే మృణాల్ ఠాకూర్ ఎప్పడు గ్లామర్ ఫొటోస్ నే వదులుతుంది. రీసెంట్ గా జిమ్ లో చెమటలు చిందిస్తున్న వీడియో షేర్ చేసిన మృణాల్ ఠాకూర్ తాజాగా ప్రకృతి వడిలో సేదతీరుతూ కనిపించింది. బ్లాక్ స్లీవ్ లెస్ గౌన్ లో బ్యాక్ ఓపెన్ తో ప్రకృతి ఒడిలో మైమరిచిపోతూ మృణాల్ ఠాకూర్ గడ్డిలో పడుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది.
ప్రస్తుతం మృణాల్ ఠాకూర్ పువ్వులతో ఆడుకుంటూ, పచ్చని ప్రకృతి అందాల ఫొటోస్ నెట్టింట్లో వైరల్ గా మారాయి.