విజయ్ దేవరకొండ త్వరలో `కింగ్ డమ్`తో ప్రేక్షకుల ముందుకొస్తున్న సంగతి తెలిసిందే. ఇదీ భారీ యాక్షన్ థ్రిల్లర్. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ అందరినీ ఆకట్టుకుంది. ఈ సినిమా సక్సెస్ అయితే దేవరకొండకు మాస్ లో మరింత ఫాలోయింగ్ పెరుగుతుందనడంలో సందేహం లేదు. టీజర్‌లో అతడి క్యారెక్టరైజేషన్ ఆకట్టుకుంటుంది. డైలాగుల్లో ఇంటెన్షన్ మెప్పించింది. పర్పెక్ట్ మాస్ రోల్ ని అతడి కోసం గౌతమ్ తిన్ననూరి డిజైన్ చేసారు.
గౌతమ్ తిన్ననూరి సినిమాలంటే రోటీన్ కి భిన్నమైన కంటెంట్‌తో తెరకెక్కుతాయి. కథలో ఎమోషన్ ని అతడు హైలైట్ చేయగలడు. కింగడమ్ లోనూ అలాంటి ఎమోషన్ ప్రధాన అస్సెట్ కానుందని చెబుతున్నారు. లైగర్ లాంటి మాస్ సినిమాతో ఫ్లాప్ ని ఎదుర్కొన్న దేవరకొండ కింగ్ డమ్ విజయంపై ధీమాగా ఉన్నాడని టాక్ వినిపిస్తోంది. కింగ్ డమ్ లో నటించేప్పుడే అతడు వరుసగా మాస్ చిత్రాలకు సంతకం చేయడానికి కారణం కూడా తెలిసింది. తదుపరి వరుసగా యాక్షన్ ఎంటర్ టైనర్‌లతో పాన్ ఇండియాను ఢీకొట్టాలని అతడు ప్లాన్ చేస్తున్నాడని తెలిసింది.
దేవరకొండ ప్రధాన పాత్రలో రవి కిరణ్ కోలా దర్శకత్వంలో `రౌడీ జనార్ధన్` తెరకెక్కనుంది. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇది పక్కా మాస్ చిత్రం. రాజు గారు ఏ సినిమా చేసినా అది పైసా వసూల్ కంటెంట్ తో రక్తి కట్టిస్తుంది. కథల ఎంపిక పరంగా రాజుగారు జడ్జిమెంట్ ప్లస్ అవుతుంది. దీంతో ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు పెరిగాయి. అలాగే రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో విజయ్ చేస్తున్నది పీరియాడిక్ స్టోరీ. ఇది భారీయాక్షన్ చిత్రం. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో సాగుతుంది. ఇందులో హీరో పాత్ర రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా ఉండబోతుందని సమాచారం. అయితే బ్యాక్ టు బ్యాక్ యాక్షన్ చిత్రాల్లో నటించడం అంటే ఆ మేరకు దేవరకొండ ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుందని అభిమానులు అంచనా వేస్తున్నారు.