ఏపీ మంత్రి నారా లోకేష్ టీడీపీ కార్యకర్తలకు కొన్ని కీలక సూచనలు చేసారు. పార్టీలో కీలకమైన కార్యకర్తలకు లోకేష్ ఎప్పటికప్పుడు వెన్నుదన్నుగా నిలవడమే కాదు వారికి ఏ అవసరం వచ్చినా ముందు సహాయం చేసే లోకేష్ తాజాగా కార్యకర్తలతో కొన్ని ముఖ్యమైన విషయాలు పంచుకున్నారు.
1) దయచేసి మీరు గ్రామంలో యూనిటీగా ఉండండి
2) గ్రామస్థాయి లో పని జరగపోతే మండలపార్టీ నాయకుల ద్వారా పనులు చేసుకోండి
3) అప్పటికి అవ్వకపోతే MLA దగ్గరకి వెళ్ళండి
4) అప్పటికి అవ్వకపోతే మీ ఇంచార్జీ మినిస్టర్ దగ్గరికి వెళ్ళండి
5) అప్పటికి అవ్వకపోతే టీడీపీ సెంట్రల్ ఆఫీస్ మంగళగిరికి వచ్చి ఒక అర్జీ ఇవ్వండి...
మన ఇంట్లో ఉంటే పనులు అవ్వవు దయచేసి మీ సొంత పనులు అడగండి, మీకు సమస్యలు లేకపోతే అప్పుడూ తీసుకురండి మిగతావారి పనులు.... ఎక్కడ నిరుత్సాహ పడవద్దు.
అమ్మ మీద నాన్న మీద అలిగినట్టు పార్టీ మీద అలగండి కానీ అమ్మ లాంటి పార్టీ నీ మరచిపోవద్దు..
దయచేసి మూడవవ్యక్తి చెప్పింది నమ్మవద్దు మీరు లైవ్ లో విన్నవి నమ్మండి...
మన MLA వైసీపీ వాళ్ళకి చేస్తున్నాడు అంటా?
లోకేష్ టైమ్ ఇవ్వడం లేదు అంటా?
బాబు గారు అసలు కలవడం లేదు అంటా? ఇలాంటీ పుకార్లు నమ్మవద్దు... మేము మనషులం కదా! కొన్ని తప్పులు చేయవచ్చు దయచేసి మీరు చెప్పండి... అంటూ కార్యకర్తలకు లోకేష్ అత్యంత విలువ ఇవ్వడం హాట్ టాపిక్ అయ్యింది.