టాప్ హీరోయిన్ సమంత దర్శకుడు రాజ్ నిడమోరు ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు, సమంత-రాజ్ నిడమోరు డేటింగ్ లో ఉన్నారనే వార్తలు సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. అటు సమంత కానీ, ఇటు రాజ్ నిడమోరు కానీ ఈ ప్రచారానికి చెక్ పెట్టకపోయేసరికి, సమంత పోస్ట్ చేసే ఫొటోస్ చూసి సమంత సైలెంట్ గా హింట్ ఇస్తుంది, రాజ్ నిడమోరు తో ఆమె డేటింగ్ లోనే ఉంది, నాగ చైతన్య మూవ్ ఆన్ అయ్యాడు, సమంత కూడా అతి త్వరలోనే పెళ్లి పీటలెక్కుతుంది అనుకుంటున్నారు.
సమంత నిర్మించిన శుభం చిత్రం విషయంలో కర్త, కర్మ, క్రియగా రాజ్ నిడమోరు కనిపించడమే ఈ ఊహాగానాలకు బలం చేకూర్చేలా చేసాయి. అటు రాజ్ కూడా తన భార్యకు విడాకులు ఇచ్చాడనే వార్తలు ఇంగ్లీష్ మీడియాలో ప్రముఖంగా ప్రచురితమయ్యాయి. తాజాగా సమంత-రాజ్ నిడమోరు రిలేషన్ పై సమంత మేనేజర్ క్లారిటీ ఇచ్చారు.
సమంత, రాజ్‌ల గురించి వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. అవన్నీ కేవలం రూమర్స్ మాత్రమే, వారిద్దరి మధ్య కేవలం వృత్తిపరమైన స్నేహం మాత్రమే ఉందని సమంత మేనేజర్ స్పష్టం చేసారు. మరి ఇప్పటికైనా సమంత-రాజ్ నిడమోరు లపై ఆ రూమర్స్ ఆగుతాయో లేదో చూడాలి.