Advertisementt

న‌టుడిపై నిర్మాత లైంగిక వేధింపులు

Thu 15th May 2025 09:45 PM
romit raj  న‌టుడిపై నిర్మాత లైంగిక వేధింపులు
Producer sexually harassed actor న‌టుడిపై నిర్మాత లైంగిక వేధింపులు
Advertisement
Ads by CJ

ఇటీవ‌లి కాలంలో చాలామంది న‌టీమ‌ణులు స‌హ‌చ‌ర మేల్ న‌టులు త‌మ‌ను వేధించార‌ని ఆరోపించారు. మీటూ ఉద్య‌మంలో భాగంగా కొంద‌రు క‌థానాయిక‌లు సైతం త‌మ‌ను వేధించిన వారిపై ఫిర్యాదులు చేసారు. ప‌లువురిపై  విచార‌ణ‌లు సాగాయి. కానీ ఏదీ నిరూప‌ణ కాలేదు. అయితే ఇండ‌స్ట్రీలో వేధింపులు కేవ‌లం మ‌హిళా న‌టీమ‌ణుల‌కు మాత్ర‌మే అనుకుంటే పొర‌పాటే. ముంబై లాంటి చోట్ల ఏదైనా జ‌ర‌గొచ్చు. అక్క‌డ మ‌గ న‌టుల‌కు లైంగిక వేధింపులు ఎదురైన ఘ‌ట‌న‌లు కోకొల్ల‌లు.

కొంద‌రు నిర్మాత‌లు అవ‌కాశాల పేరుతో మ‌గ న‌టుల‌ను లోబ‌రుచుకుంటార‌నేది చాలా కాలంగా వింటున్నదే. ఇప్పుడు అలాంటి వేధింపులు త‌న‌కు కూడా ఎదుర‌య్యాయ‌ని, పేరున్న బ‌డా నిర్మాత త‌న‌ను లైంగికంగా వేధించాడ‌ని, బ‌లాత్కారం చేయ‌బోయాడ‌ని ప్ర‌ముఖ టీవీ న‌టుడు ఆరోపించారు. అవకాశం కావాలంటే ప‌క్క పంచుకోవాల‌ని అడిగాడ‌ని తెలిపాడు. 

స్టార్ ప్ల‌స్ లో `యే రిస్తా క్యా కెహ‌త్తా హై` సిరీస్ తో పాపుల‌రైన రోమిత్ రాజ్ త‌న‌కు వేధింపులు ఎదుర‌య్యాయ‌ని ఆరోపించడంతో ఇది ఇండ‌స్ట్రీని హీటెక్కించింది. అత‌డు గ‌తంలో త‌న కోహోస్ట్, బిగ్ బాస్ ఫేం షిల్పా షిండే నుంచి విడిపోయాన‌ని కూడా తెలిపాడు. ప‌ర‌స్ప‌ర అంగీకారంతో, తన నుంచి స‌రైన స‌మ‌యంలో విడిపోయానని అత‌డు వెల్ల‌డించాడు.

Producer sexually harassed actor:

Romit Raj on harassment

Tags:   ROMIT RAJ
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ