మే 9 నుంచి పోస్ట్ పోన్ అయిన పవన్ కళ్యాణ్ హరి హర హర వీరమల్లు ఎట్టి పరిస్థితుల్లో మే 30 కి వచ్చేస్తుంది అని పవన్ ఫ్యాన్స్ గట్టిగా అనుకున్నారు, సోషల్ మీడియాలోనూ అదే ప్రచారం జరిగింది, ఆ డేట్ కి రావాల్సిన విజయ్ దేవరకొండ కింగ్ డమ్ జులై 4కి వెళ్ళిపోయింది. ఇప్పుడు వీరమల్లు మే 30 న రాబోవడం లేదు.
పవన్ కళ్యాణ్ రీసెంట్ గానే షూటింగ్ ఫినిష్ చేసినా మే 30 కి వీరమల్లుని దించేందుకు మేకర్స్ హడావిడి పడడం లేదు, మరోపక్క హరి హార వీరమల్లు ఓటీటీ పార్ట్నర్ అమెజాన్ ప్రైమ్ ఒత్తిడితో వీరమల్లు ని మే 30 కి దించాలని చూసినా.. నిర్మాత ఏఎం రత్నం అమెజాన్ సంస్థ తో చర్చించి హరి హర వీరమల్లుని జూన్ 13 న విడుదల చెయ్యాలని ఒప్పందం చేసుకున్నారని టాక్ వినబడుతుంది.
పాన్ ఇండియా ఫిలిం హరిహర వీరమల్లు పార్ట్ 1 ని జూన్ రెండో వారంలో అందులోను 13 నే రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. త్వరలోనే వీరమల్లు రిలీజ్ పై మేకర్స్ అధికారిక ప్రకటన ఇస్తారని సమాచారం. ఎట్టి పరిస్తితుల్లోనూ వీరమల్లు జూన్ ని వదిలే ప్రసక్తి లేదని అంటున్నారు.