తెలుగు అమ్మాయిలు హీరోయిన్స్ గా అదృష్టాన్ని పరిక్షించుకుంటున్నా వారిలో కొంతమంది సక్సెస్ అయితే మరికొంతమంది పరభాషకు తరలిపోతున్నారు. ఇక తెలుగు నుంచి వచ్చిన ఈషా రెబ్బ ట్రెడిషనల్ గా టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నా ఎందుకో ఆమెకు స్టార్ హీరోల ఛాన్స్ లు ఆమడ దూరంలోనే ఆగిపోయాయి.
ఇక కొన్నాళ్లుగా గ్లామర్ గా టర్న్ అయ్యింది. అయినప్పటికీ చెప్పుకోదగిన అవకాశం అమ్మడుకి రావడంలేదు. దయ వెబ్ సీరిస్ తర్వాత ఆమె దర్శకుడు తరుణ్ భాస్కర్ హీరోగా ఓ ప్రాజెక్ట్ లో నటిస్తుంది. రీసెంట్ టైమ్స్ లో ఈషా రెబ్బ అందాల ఆరబోత సోషల్ మీడియాలో ఎక్కువైంది.
రకరకాల కాస్ట్యూమ్స్ తో ఈషా రెబ్బ అందాలు చూపించేందుకు తహతహలాడుతోంది. తాజాగా బ్రౌన్ కలర్ మోడ్రెన్ వేర్ లో ఈషా రెబ్బ ఇచ్చిన భంగిమలు చూస్తే యూత్ కి మతి పోవాల్సిందే. లూజ్ హెయిర్ తో మోడ్రెన్ లుక్ లో ఈషా రెబ్బాని చూసి ఆహా అనాల్సిందే.