మలయాళంలో ఎలాంటి అంచనాలు లేకుండానే ఈ ఏడాది బిగ్ హిట్స్ నమోదు అవుతున్నాయి. జనవరిలో ఐడెంటిటీ మొదలుకుని రేఖా చిత్రం, అలాగే పృథ్వీరాజ్ సుకుమారన్ L 2 ఎంపురాన్ నిన్నగాక మొన్న మోహన్ లాల్ తుడరుమ్ ఇలా ప్రతి నెల మలయాళం ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ హిట్స్ నమోదు చేస్తుంది. L 2 మిగతా భాషల్లో ప్లాప్ అయినా మలయాళంలో మాత్రం పెద్ద హిట్ అయ్యింది.
ఇక ఎలాంటి అంచనాలు లేకుండా మోహన్ లాల్ తుడరుమ్ ఏప్రిల్ లో విడుదలై సెన్సేషనల్ హిట్ అయ్యింది. తుడరుమ్ మళయాళంలోనే కాదు మిగతా లాంగ్వేజెస్ లోను పెద్ద హిట్ అయ్యింది. ఎలాంటి ప్రమోషన్స్ లేకుండానే తుడరుమ్ హిట్ అవడమే కాదు బిగ్ నెంబర్లు నమోదు చేస్తుంది. అయితే ఈమధ్యకాలంలో మలయాళంలో ఎంత పెద్ద హిట్ సినిమా అయినా మూడు వారాలు పూర్తి కాగానే ఓటీటీ కి వచ్చేస్తున్నాయి.
రీసెంట్ గా విడుదలైన ఐడెంటిటీ, L 2ఎంపురాన్ అలానే విడుదలైన మూడు వారాలకే ఓటీటీ లో స్ట్రీమింగ్ కి వచ్చేసాయి. ఇప్పుడు కూడా మోహన్ లాల్ తుడరుమ్ థియేటర్స్ లో విడుదలైన మూడు వారాలకే ఓటీటీలోకి వస్తుంది అని ఫ్యామిలీ ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు తుడరుమ్ చిత్ర ఓటీటీ డిలే అవ్వొచ్చనే ఊహాగానాలు మొదలయ్యాయి.
థియేటర్స్ లో బిగ్ హిట్ అయిన తుడరుమ్ ఓటీటీ రాక ఆలస్యమయ్యే అవకాశం ఉంది అంటున్నారు. మరి తుడరుమ్ ఓటీటీ పై మేకర్స్ ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూడాలి.