అల్లు అర్జున్ ఇప్పుడు ఇంటెర్నేషనల్ రేంజ్ లో ఉన్నారు. పుష్ప 2 సక్సెస్ తర్వాత అల్లు అర్జున్ ప్రాజెక్ట్ ఇంటర్నేషనల్ స్థాయిలోనే కాదు, అంతా ముంబై వేదికగానే జరుగుతుంది. కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ కూడా ముంబై లోనే ఉండి అల్లు అర్జున్ ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నారు. ఇప్పటికే అనౌన్సమెంట్ వీడియో తో అల్లు అర్జున్-అట్లీ సెన్సేషన్ క్రియేట్ చేసారు.
ముంబై వేదికగా ఇప్పటికే అల్లు అర్జున్-అట్లీ మూవీ సైలెంట్ గా పూజా కార్యకమాలతో మొదలు పెట్టేసారు. ఇక జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది అనే ప్రచారం నిజమే. జూన్ మిడ్ నుంచి ముంబై నుంచి అల్లు అర్జున్-అట్లీ కాంబో మూవీ షూటింగ్ మొదలు కాబోతున్నట్టుగా తెలుస్తుంది.
ముంబాయిలో మాక్ షూట్ ప్రారంభమవుతుంది అంటున్నారు. ఈ చిత్రంలో వన్ ఆఫ్ ద హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ ఎంపికయ్యింది అని, అల్లు అర్జున్ ఈ చిత్రంలో ద్విపాత్రాభినయం చెయ్యబోతున్నారని తెలుస్తుంది.