రిస్క్ అయినా రస్క్ లా తీసుకుంటున్నారా?
విజయ్ దేవరకొండకు సరైన సక్సస్ పడి చాలా కాలమవుతోంది. `గీత గోవిందం` తర్వాత ఆ రేంజ్ హిట్ మరోటి పడలేదు. ఆ సక్సెస్ తర్వాత ఏడు సినిమాలో చేసాడు. అందులో `ఖుషీ` యావరేజ్ గా ఆడింది. మొత్తంగా విజయ్ కెరీర్ గ్రాఫ్ పరిశీలిస్తే మార్కెట్ డౌన్ ఫాల్ లోనే ఉంది. ప్రస్తుతం `కింగ్ డమ్` తో బౌన్స్ బ్యాక్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలతో భారీ హైప్ క్రియేట్ అయింది.
నిజంగా హిట్ అయితే? దేవరకొండ కెరీర్ కొత్త టర్నింగ్ తీసుకున్నట్లే. మాస్ ఇమేజ్ అంతకంతకు రెట్టింపు అవ్వడం ఖాయం. ఇంతవరకూ మాస్ యాక్షన్ థ్రిల్లర్ లు చేసింది లేదు. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్న చందంగా సక్సెస్ తో పాటు మాస్ ఇమేజ్ యాడ్ అవుతుంది. ఇదంతా `కింగ్ డమ్` సక్సెస్ అయితే మాట. అయితే సరిగ్గా ఇదే సమయంలో విజయ్ దేవరకొండతో మైత్రీ మూవీ మేకర్స్ భారీ చిత్రానికి రెడీ అవుతోంది.
రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో 1800 కాలంనాటి వాస్తవ సంఘటనలు ఆధారంగా ఓ పీరియాడిక్ చిత్రానికి రంగం సిద్దమవుతోంది. అప్పటి కాలాన్ని స్పృశిస్తూ భారీ సెట్లు సిద్దం చేస్తున్నారు. ఈ నేపథ్యం లో ఈ నిసిమా బడ్జెట్ 200 కోట్లు అని నిర్మాణ వర్గాల నుంచి లీకైంది. బడ్జెట్ విషయంలో ఏమాత్రం రాజీ లేకుండా పెట్టుబడి పెట్టడానికి మైత్రీ ముందుకొస్తుంది. అయితే విజయ్ వరుస వైఫల్యాల నేపథ్యంలో ఇంత బడ్జెట్ అంటే రిస్క్ అవుతుందనే గెస్సింగ్స్ కూడా తెరపైకి వస్తున్నాయి.
విజయ్ తొలి పాన్ ఇండియా అటెంప్ట్ `లైగర్` ఎలాంటి దెబ్బ కొట్టిందో తెలిసిందే. పూరి జగన్నాధ్ ఎంతో కాన్పిడెంట్ పెట్టుబటి పెట్టి చేసిన చిత్రమది. కానీ వైఫల్యం ఆయన్ని ఎక్కడికో నెట్టింది. విజయ్ కెరీర్ లో 100 క్రోర్ చిత్రం ఒకే ఒక్కటి. అదే `గీత గోవిందం`. ఆ తర్వాత చిత్రాల వసూళ్లన్ని 30 కోట్ల లోపే ఉంటాయి. దీంతో విజయ్ మార్కెట్ ఎంతగా డౌన్ అయిందన్నది అద్దం పడుతుంది. అయినా మైత్రీ మూవీ మేకర్స్ ఏమాత్రం జంకకుండా నమ్మకంగా రంగంలోకి దిగుతుంది. `కింగ్ డమ్` సక్సెస్ అయితే ఆ నమ్మకం రెట్టింపు అవుతుంది.