Advertisementt

బిగ్ షాక్‌: టాలీవుడ్ పెద్ద సినిమాలు డిలే

Sat 10th May 2025 04:29 PM
india - pak war  బిగ్ షాక్‌: టాలీవుడ్ పెద్ద సినిమాలు డిలే
India - Pak War Tensions Impact on film releases బిగ్ షాక్‌: టాలీవుడ్ పెద్ద సినిమాలు డిలే
Advertisement
Ads by CJ

తెలుగు చిత్ర‌సీమ‌లో అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తెర‌కెక్కిన ఓ రెండు భారీ సినిమాలు విడుద‌ల తేదీల్ని మార్చుకోవాల్సిన ప‌రిస్థితి ఉంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం ఇండియా- పాక్ వార్ నేప‌థ్యంలో పాన్ ఇండియా కేటగిరీలో అత్యంత భారీగా విడుద‌లకు సిద్ధ‌మ‌వుతున్న సినిమాల బిగ్ డ్రీమ్స్ ధ్వంశ‌మ‌య్యాయి. దీని కార‌ణంగా మే చివ‌రిలో విడుద‌ల కావాల్సిన ఈ రెండు సినిమాలు జూన్ కి వాయిదా ప‌డ్డాయ‌ని చెబుతున్నారు.

 

ఆ రెండు సినిమాలలో ఒక‌టి ప‌వ‌న్ క‌ల్యాణ్ - హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు. రెండోది విజ‌య్ దేవ‌ర‌కొండ‌- కింగ్ డ‌మ్. ప‌వర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించిన మొట్ట‌మొద‌టి వారియ‌ర్ డ్రామా `హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు`ను ఏం.ఎం.ర‌త్నం పాన్ ఇండియాలో అత్యంత భారీగా రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేయ‌గా ఊహించ‌ని ప‌రిణామాలు త‌లెత్తాయి. ప్ర‌స్తుతం ఉత్త‌రాదిన ప‌రిస్థితులు ఏమంత బాలేదు. పాక్ బార్డ‌ర్ లో సైన్యం భీక‌ర పోరు చాలా సందేహాల‌ను లేవ‌నెత్తింది. దీని కార‌ణంగా ఉత్త‌రాదిన వీర‌మ‌ల్లును భారీగా విడుద‌ల చేసే ప‌రిస్థితులు లేవు. ప్ర‌స్తుత టెన్ష‌న్స్ న‌డుమ‌ హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు చిత్రాన్ని జూన్ కి వాయిదా వేసార‌ని టాక్ వినిపిస్తోంది. అలాగే హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కూడా డిలే అయింద‌ని టాక్ వినిపిస్తోంది.

 

వీర‌మ‌ల్లుతో పాటు విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం `కింగ్ డ‌మ్` కూడా మే చివ‌రిలో కాకుండా జూన్ లో విడుద‌ల‌య్యేందుకు ఛాన్సుంద‌ని చెబుతున్నారు. లైగ‌ర్ తో పాన్ ఇండియాలో ఫ్లాప్ ని ఎదుర్కొన్న దేవ‌ర‌కొండ ఈసారి కింగ్ డ‌మ్ తో దానిని రీక‌వ‌రి చేయాల‌ని అనుకున్నాడు. దీనికోసం హిందీ బెల్ట్ లో అత్యంత భారీగా విడుద‌ల చేయాల‌ని ప్లాన్ చేసారు. కానీ ప‌రిస్థితులు అనూహ్యంగా మారాయి. యుద్ధ వాతావ‌ర‌ణంతో ఇండియా వేడెక్కిపోతోంది. ఇలాంటి స‌మ‌యంలో కింగ్ డ‌మ్ ని పాన్ ఇండియాలో రిలీజ్ చేయ‌డం క‌ష్ట‌మ‌ని టీమ్ భావిస్తోంద‌ని స‌మాచారం. అయితే చిత్ర‌నిర్మాత‌లు త‌మ సినిమాల్ని వాయిదా నిర్ణ‌యాన్ని అధికారికంగా ప్ర‌టించాల్సి ఉంటుంది. ప్ర‌స్తుతానికి ఇవ‌న్నీ ఊహాగానాలు మాత్ర‌మే.  

India - Pak War Tensions Impact on film releases:

  Impact of Recent Events Tollywood films postponed  

Tags:   INDIA - PAK WAR
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ