గత ఏడాది లక్కీ భాస్కర్ తో 100 కోట్ల హీరోయిన్ గా మారిన మీనాక్షి చౌదరి.. ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం చిత్రంతో 300 కోట్ల క్లబ్బులోకి అడుగుపెట్టిన హీరోయిన్ గా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఖిలాడీ సినిమాలో మీనాక్షి చౌదరి లుక్ చూసి పెదవి విరిచి వారే ఇప్పుడు టాలీవుడ్ లో ఆమె హవా చూసి షాకవుతున్నారు. ప్రస్తుతం మీనాక్షి బాలీవుడ్ లోకి అడుగుపెట్టబోతున్నట్లుగా తెలుస్తుంది.
హిందీలో ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మించే చిత్రంలో మీనాక్షి కీలక పాత్రకు ఎంపికయ్యింది అనే వార్తలు ఆమె అభిమానులను సర్ ప్రైజ్ చేస్తున్నాయి. ఇక సోషల్ మీడియాలో ఎప్పుడు గ్లామర్ ఫొటోస్ షేర్ చేసే మీనాక్షి చౌదరి.. తాజాగా వదిలిన పిక్స్ చూస్తే వావ్ బ్యూటిఫుల్ అంటారేమో.
బ్లాక్ టాప్ పై మెడలో రెడ్ క్లాత్ లో స్టయిల్ గా ఒక పిక్ లో కనిపించిన మీనాక్షి చౌదరి.. మరో పిక్ లో రెడ్ కాస్ట్యూమ్ లో గ్లామర్ గా ఆకట్టుకుంది. ప్రస్తుతం మీనాక్షి చౌదరి కొత్త లుక్ నెట్టింట వైరల్ అవుతుంది.