Advertisementt

వీరమల్లు డేట్ ఫైనల్ అయినట్లే

Wed 07th May 2025 05:25 PM
pawan kalyan  వీరమల్లు డేట్ ఫైనల్ అయినట్లే
Hari Hara Veera Mallu gets new release date వీరమల్లు డేట్ ఫైనల్ అయినట్లే
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ ఎట్టకేలకు హరి హర వీరమల్లు షూటింగ్ పూర్తి చేసేసారు. హరి హర వీరమల్లు షూటింగ్ పూర్తి కావడంతో ఇప్పుడు ఈ చిత్రం విడుదల విషయంలో బోలెడన్ని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మే 30 అని, కాదు జూన్ రెండో వారమంటూ ప్రచారం జరుగుతుంది. ఈలోపు హరి హర వీరమల్లు ఓటీటీ పార్ట్నర్ వీరమల్లు రిలీజ్ డేట్ ఫైనల్ చేస్తుంది అంటున్నారు. 

ఇప్పుడు కూడా వీరమల్లు నిర్మాత ఏఎం రత్నం గారు ముంబై వెళ్లి అమెజాన్ ప్రైమ్ సంస్థతో హరి హర వీరమల్లు రిలీజ్ తేదీపై చర్చలు జరుపుతున్నారని, జూన్ 12 న వీరమల్లు రిలీజ్ తేదీని ఫైనల్ చేసి రేపు అంటే గురువారం సాయంత్రం విడుదల తేదీపై అధికారిక ప్రకటన ఇస్తారని అంటున్నారు. 

మరి వీరమల్లు రిలీజ్ తేదీ కోసమే విజయ్ దేవరకొండ కింగ్ డమ్ ఎదురు చూస్తుంది. హరి హర వీరమల్లు రిలీజ్ తేదీ ఫైనల్ చేస్తే కింగ్ డమ్ మే 30 నుంచి తప్పుకొవాలా, లేదా అనేది ఆలోచిస్తుంది. రేపు ఈపాటికి వీరమల్లు రిలీజ్ తేదీపై క్లారిటీ వస్తుంది అని సమాచారం. 

Hari Hara Veera Mallu gets new release date:

Pawan Kalyan Hari Hara Veera Mallu gets new release date

Tags:   PAWAN KALYAN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ