అల్లు అర్జున్ ప్రస్తుతం ఎక్కువగా ముంబై లోనే కనిపిస్తున్నారు. పుష్ప 2 హిట్ తర్వాత అల్లు అర్జున్ కోలీవుడ్ దర్శకుడు అట్లీ తో మూవీని స్టార్ట్ చెయ్యబోతున్నారు. రీసెంట్ గానే అల్లు అర్జున్-అట్లీ కాంబో మూవీ పూజా కార్యక్రమాలు ముంబైల్ సైలెంట్ గా జరిగిపోయాయి. ప్రస్తుతం ముంబై లోనే అల్లు అర్జున్ ఎక్కువ సమయం గడుపుతున్నారు.
తాజాగా అల్లు అర్జున్ బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ ఇంటికి వెళ్లి కొద్దిసాపు ముచ్చటించి రావడం చర్చనీయాంశం అయ్యింది. ఆమిర్ తో కలిసి అల్లు అర్జున్ ఫోటో దిగడం అందరిలో విపరీతమైన క్యూరియాసిటీని పెంచేసింది. మరి అల్లు అర్జున్-అట్లీ ప్రాజెక్ట్ లో ఆమీర్ నటించేందుకు చర్చలు జరుగుతున్నాయా..
లేదంటే ఆమీరా ఖాన్ చెప్పిన మహాభారతంలో ఎంతోమంది స్టార్ హీరోలు భాగమవుతారని చెప్పారు, ఆ మహాభారతంలో అల్లు అర్జున్ నటింపజేసేందుకు చర్చలు జరుగుతున్నాయా అనేది ఇప్పుడు అందరిలో మొదలైన డౌట్.