కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతార ఇప్పటికీ టాప్ పొజిషన్ లోనే కొనసాగుతుంది. అటు రెమ్యునరేషన్ పరంగాను, ఇటు అవకాశాల పరంగాను నయనతార రేంజ్ మామూలుగా లేదు. అందులోను జవాన్ తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి బిగ్ హిట్ కొట్టిన నయనతార పారితోషికం ఇపుడు ఆకాశాన్నంటింది.
అందుకే నయనతార మెగాస్టార్ అయితే నాకేంటి నేను అడిగిన పారితోషికం ఇవ్వాల్సిందే అంటుంది. మెగాస్టార్ చిరు తో చెయ్యబోయే సినిమా కోసం దర్శకుడు అనిల్ రావిపూడి నయనతారను సంప్రదించినట్లుగా వార్తలొచ్చాయి. అయితే నయనతార చిరు సినిమా కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
కాకపోతే చిరు-అనిల్ ప్రాజెక్ట్ లో నటించేందుకు నయనతార ఏకంగా 18 కోట్లు డిమాండ్ చేసిందట, మెగాస్టార్ అయితే నాకేంటి అని బిహేవ్ చేసినట్లుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరి నయనతార కేవలం సినిమా లో నటించేందుకు అంత డిమాండ్ చేస్తుంది. అంత తీసుకుని కనీసం ప్రమోషన్స్ కు కూడా రాదు. అయినా ఆమె రేంజ్ మారదు.
ఇక జవాన్ హిట్ తర్వాత నయనతార నటించిన చిత్రాలు బ్యాక్ టు బ్యాక్ ప్లాప్స్ వచ్చాయి. అయినా ఆమె మాత్రం పారితోషికం విషయంలో తగ్గేదేలే అనడం నిజంగా అందరికి షాకిచ్చే విషయమే.