బాలీవుడ్ లో ఓం రౌత్ తెరకెక్కించిన ఆదిపురుష్ చిత్రం ఎన్ని విమర్శలు మూటగట్టుకుందో అందరికి తెలుసు. కానీ దర్శకుడు ఓం రౌత్ మాత్రం ఆ విషయాన్ని అస్సలు ఒప్పుకోడు, తానేదో కళాకండం తెరకెక్కిస్తే ఎవ్వరికి నచ్ఛలేదు అంటాడు. ఆదిపురుష్ రిజల్ట్ పై ప్రభాస్ ఫ్యాన్స్ చాలా డిజప్పాయింట్ అయ్యారు.
ఇక ఆదిపురుష్ లో నటించిన నటులు ఒక్కొక్కరిగా ఆదిపురుష్ చిత్రంపై ఓపెన్ అవుతున్నారు. అందులో ఆదిపురుష్ కి డైలాగ్స్ రాసిన మాటల రచయిత, మ్యూజిక్ డైరెక్టర్ ఇలా ఆదిపురుష్ ఫెయిల్యూర్ గురించి మాట్లాడారు. తాజాగా ఆదిపురుష్ లో రావణ్ పాత్రలో కనిపించిన సైఫ్ అలీ ఖాన్ ఆదిపురుష్ పై ఓపెన్ అయ్యారు.
రీసెంట్ గా తన కొడుకుతో కలిసి ఆదిపురుష్ ని వీక్షించగా, అందులో తాను పోషించిన రావణ్ పాత్ర చూసేందుకు తన కొడుకు ఇబ్బంది పడడం గమనించి,ఇంకోసారి అలాంటి పాత్రలు చెయ్యను అని కొడుకుని క్షమించమని అడిగినట్లుగా చెప్పడం చూసిన వారు ఇక ఆదిపురుష్ పై ప్రభాస్ ఎప్పుడు మాట్లాడతారో అంటూ కామెంట్లు పెడుతున్నారు.
మరి ఆదిపురుష్ విషయంలో ప్రభాస్ మనసులో ఏముందో ఎవ్వరికి తెలియదు, మనకు తెలిసి ప్రభాస్ ఆదిపురుష్ రిజల్ట్ పై ఓపెన్ అయ్యే అవకాశం కూడా ఉండదు, ఎందుకంటే ప్రభాస్ ఎవ్వరిని బ్లేమ్ చెయ్యరు.. అని ప్రభాస్ అభిమానులే మాట్లాడుకుంటున్నారు.