నిన్నటివరకు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి చేతినిండా సంపాదనతో కార్లు, కొత్తిళ్ళు కొనుకున్న వారి పేర్లను ప్రూప్స్ తో సహా బయటపెట్టి సెన్సేషన్ క్రియాట్ చేసిన ప్రపంచ యాత్రికుడు నా అన్వేషి యుట్యూబర్ అన్వేష్ పై ఇప్పుడు కేసు నమోదు కావడం హాట్ టాపిక్ అయ్యింది. బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసే వారి పేర్లను బయటపెట్టడమే కాకుండా వారిపై చాలా సందర్భాల్లో అనుచిత వ్యాఖ్యలు కాదు చాలా నీచమైన కామెంట్స్ చేసాడు.
అలాంటి అన్వేష్ పై ఇప్పుడు సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు. కారణం అన్వేష్ రాష్ట్ర ప్రభుత్వంలోని ఉన్నతాధికారులపై తీవ్ర ఆరోపణలు చేస్తూ, అవాస్తవాలు చూపుతూ వీడియోను ప్రచారం చేశారనే అభియోగంపై పోలీసులు సుమోటోగా ఈ కేసును స్వీకరించారు. నా అన్వేషి యూట్యూబ్ ఛానల్ లో తెలంగాణ డీజీపీ జితేందర్, హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, సీనియర్ ఐఏఎస్ అధికారులు శాంతికుమారి, దానకిశోర్, వికాస్‌రాజ్ లు హైదరాబాద్ మెట్రోలో బెట్టింగ్ యాప్‌ల ప్రచారానికి అనుమతులు ఇచ్చే నెపంతో రూ.300 కోట్లు అక్రమంగా ఆర్జించారని ఆరోపిస్తూ తప్పుడు సమాచారంతో ఓ వీడియోని పోస్ట్ చేసాడు.
అన్వేష్ ఈ వీడియోలో చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని, తప్పుడు సమాచారంతో కూడినవని అని సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించి అతనిపై కేసు నమోదు చేసారు. హర్ష సాయి, యాంకర్ శివ జ్యోతి, శ్యామల, విష్ణు ప్రియా ఇలా చాలామంది పేర్లు బయటపెట్టిన అన్వేష్ ఆ తర్వాత వారి ఫ్యామిలీస్ పై చేసిన వ్యాఖ్యలు అతనికి చేటు తెచ్చిపెట్టాయి. ఇప్పుడు ఉన్నతాదికారులపై చేసిన వీడియో అతన్ని కటకటాల వెనక్కి పంపించేందుకు సిద్ధమైంది.