Advertisementt

NTRNeel ప్రాజెక్ట్ పై బ్లాస్టింగ్ న్యూస్

Sun 04th May 2025 09:15 AM
ntr   NTRNeel ప్రాజెక్ట్ పై బ్లాస్టింగ్ న్యూస్
Blasting news on NTRNeel project NTRNeel ప్రాజెక్ట్ పై బ్లాస్టింగ్ న్యూస్
Advertisement
Ads by CJ

యంగ్ టైగర్ ఎన్టీఆర్-కన్నడ టాప్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో మొదలైన డ్రాగన్ ప్రాజెక్ట్ పై ట్రేడ్ లో విపరీతమైన అంచనాలున్నాయి. రీసెంట్ గానే ఎన్టీఆర్ డ్రాగన్ సెట్స్ లోకి వెళ్లారు. బెంగుళూరుకు సమీపంలో ఎన్టీఆర్-నీల్ షూటింగ్ చిత్రీకరణ జరుగుతుంది. న్యూక్లియర్, విస్ఫోటనం, బ్లాస్టింగ్ అంటూ ఎన్టీఆర్-నీల్ ప్రాజెక్ట్ పై మైత్రి మూవీస్ వారు మొదటి నుంచి అంచనాలు క్రియేట్ చేస్తున్నారు. 

తాజాగా ఎన్టీఆర్-నీల్ ప్రాజెక్ట్ పై బ్లాస్టిగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఓ కుర్ర దర్శకుడు ఎన్టీఆర్-నీల్ ప్రాజెక్ట్ పై స్పందిస్తూ.. డ్రాగన్ ఇంటర్నేషనల్ లెవల్లో షేక్ చేస్తుంది, మే 20 ఎన్టీఆర్ బర్త్ డే కి డ్రాగన్ నుంచి బ్లాస్టింగ్ గ్లింప్స్ ని వదులుతున్నారు. అది చూస్తే డ్రాగన్ ఏ రేంజ్ ప్రాజెక్ట్ అనేది అర్ధమవుతుంది అంటూ చేసిన కామెంట్స్ మాత్రం సంచలనంగా మారాయి. 

ఎన్టీఆర్-నీల్ ప్రాజెక్ట్ పై ఏ చిన్న న్యూస్ బయటికొచ్చినా అది క్షణాల్లో వైరల్ అవుతుంది. ప్రస్తుతం సైలెంట్ గా ఎన్టీఆర్-నీల్ తమ పని తాము చేసుకుంటున్నా మే 20కి మాత్రం బ్లాస్టింగ్ అప్ డేట్ గ్యారెంటీ అనేది తెలుస్తుంది. గెట్ రెడీ ఎన్టీఆర్ ఫ్యాన్స్.. సంబరాలకు సిద్దమైపొండి. 

Blasting news on NTRNeel project:

Sensational update from NTR-Neel project 

Tags:   NTR
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ