పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రాలు హరి హర వీరుమల్లు, OG ఈ రెండు షూటింగ్ పూర్తి చేసుకుని ఎప్పుడేప్పుడు విడుదలవుతాయా అని అభిమానులే కాదు అందరూ ఎదురు చూస్తున్నారు. అందులోను ఆ చిత్రాలు పాన్ ఇండియా ఫిలిమ్స్ కావడం, పవన్ కళ్యాణ్ తో పాటుగా పలు భాషల క్రేజీ నటులు యాడ్ అవడంతో ఆ ప్రాజెక్ట్స్ పై విపరీతమైన అంచనాలున్నాయి.
పవన్ కళ్యాణ్ ఎప్పుడెప్పుడు ఆ షూటింగ్స్ పూర్తి చేస్తారా అని ఎదురు చూస్తున్నారు. మే 9 కి రావాల్సిన హరి హర వీరమల్లు పోస్ట్ పోన్ అయినట్లే. ఇక OG సెప్టెంబర్ రిలీజ్ అంటూ చెబుతున్నారు. ప్రస్తుతం మేకర్స్ మాత్రం వీరమల్లు-OG సినిమాల విషయంలో సైలెంట్ గా ఉన్నారు. తాజాగా OG చిత్రంలో విలన్ గా నటిస్తున్న బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ OG పై క్రేజీ అప్ డేట్ షేర్ చేసారు.
ఇమ్రాన్ హష్మీకి సంబందించిన పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో ఇప్పటిదాకా ఒక్క సీన్ కూడా షూట్ జరగలేదట. ఇమ్రాన్ హష్మీ సోలో సీన్స్ మాత్రమే దర్శకుడు సుజిత్ పూర్తి చేశాడట. ఇంకో నెల రెండు నెలల్లో పిలుపు రావొచ్చని ఇమ్రాన్ హష్మీ చెప్పడంతో OG షూటింగ్ పట్టాలెక్కేందుకు రెడీ అవుతుంది అని తెలుస్తోంది.
మరి పవన్ రావాలి, OG షూటింగ్ మొదలు కావాలి, అప్పుడే విడుదల తేదీపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇక పవన్ రెడీ అయ్యే సమయానికి OG లో నటిస్తున్న కీలక నటుల డేట్స్ అడ్జెస్ట్ చేసుకోవాలి, ఇవన్నీ ఎప్పటికి పూర్తవుతాయో చూడాలి.