నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్-దీపికా పదుకొనె కలిసి నటించిన కల్కి 2898 AD చిత్రంలో ఎక్కడా వారి మద్యన రొమాన్స్ కనిపించదు. పార్ట్ 2 లో ఏమైనా ప్రభాస్-దీపికా మధ్యన రొమాన్స్ పెట్టరేమో దర్శకుడు తెలియదు. ఇప్పుడు మరోసారి ప్రభాస్-దీపికా పదుకొనె స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారనే న్యూస్ వైరల్ గా మారింది.
సందీప్ వంగ దర్శకత్వంలో ప్రభాస్ చెయ్యబోయే స్పిరిట్ కోసం సందీప్ మొదటి నుంచి బాలీవుడ్ హీరోయిన్స్ నే తీసుకోవాలని అనుకుంటున్నారు. ముందు నుంచి కరీనా కపూర్ పేరు స్పిరిట్ సినిమా విషయంలో కనిపించింది. కానీ తాజాగా దీపికా పదుకొనె అయితే ప్రభాస్ సరసన బావుంటుంది అని దర్శకుడు సందీప్ ఆలోచనగా తెలుస్తుంది.
మరి పోలీస్ ఆఫర్ పాత్రలో ప్రభాస్ కనిస్తుండగా, ఇపుడు ఈ చిత్రంలో ప్రభాస్ సరసన దీపికా పదుకునే నటిస్తే ఈ చిత్రం పై ఇప్పటివరకు ఉన్న అంచనాలు డబుల్ అవ్వడం ఖాయమంటూ అభిమానులు మాట్లాడుకుంటున్నారు. జూన్ నుంచి సందీప్ రెడ్డి వంగ-ప్రభాస్ స్పిరిట్ సెట్స్ మీదకి వెళ్లే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది.