నితిన్ -వెంకీ కుడుముల కాంబోలో డేవిడ్ వార్నర్ గెస్ట్ రోల్ లో కనిపించిన రాబిన్ హుడ్ చిత్రం మార్చ్ 28 ఉగాది స్పెషల్ గా ఆడియన్స్ ముందుకు వచ్చింది. మంచి అంచనాల నడుమ విడుదలైన ఈచిత్రం ఆ అంచనాలు అందుకోవడం విఫలమైంది. థియేటర్స్ లో రాబిన్ హుడ్ ప్లాప్ చిత్రంగా మిగిలిపోయింది.
అయితే రాబిన్ హుడ్ ఓటీటీ రిలీజ్ పై కొద్దిరోజులుగా వార్తలు రావడమే కానీ ఈ చిత్ర డిజిటల్ హక్కులు దక్కించుకున్న జీ 5 మాత్రం స్ట్రీమింగ్ డేట్ పై క్లారిటీ ఇవ్వడం లేదు. రీసెంట్ గా సంక్రాంతికి వస్తున్నాం చిత్రం విషయంలో జీ 5 ఏం చేసిందో ఇప్పుడు రాబిన్ హుడ్ చిత్రం విషయంలోను అదే ప్లాన్ ని అప్లై చేస్తుంది.
అదే ఓటీటీ స్ట్రీమింగ్ తో కలిసి ఒకేసారి టివి లోను ప్రసారం చేసే ప్లాన్ చెయ్యడమే కాదు రాబిన్ హుడ్ టీవీ ప్రీమియర్స్ డేట్ కూడా లాక్ చేసింది. మే10 సాయంత్రం 6 గంటలకు జె తెలుగులో ప్రసారం కాబోతున్నట్టుగా జీ 5 రాబిన్ హుడ్ టీవీ ప్రీమియర్స్ డేట్ ప్రకటించారు.