కొన్నాళ్లుగా బుట్టబొమ్మ పూజ హెగ్డే కి ఏ హీరో హిట్ ఇవ్వలేకపోతున్నారు. హిందీ నుంచి సౌత్ వరకు వరసగా నిరాశ పరిచే సినిమాలు రావడంతో సౌత్ లో పూజ హెగ్డే కు బిగ్ బ్రేక్ వచ్చేసింది. ఒకప్పుడు నాలుగు షిఫ్ట్ లో పని చేసిన పూజ హెగ్డే గత మూడేళ్ళుగా వెకేషన్స్ లోనే కనిపించింది కానీ సినిమా సెట్స్ లో ఎక్కడా కనబడలేదు.
ఎలాగో కోలీవుడ్ హీరో సూర్య - కార్తీక్ సుబ్బరాజు కాంబోలో తెరకెక్కిన రెట్రో లో పూజ హెగ్డే కు మంచి ఛాన్స్ రావడంతో అమ్మడు మళ్లీ లైమ్ టైమ్ లోకి వచ్చేసింది అనుకున్నారు. కోలీవుడ్ లో ఒకటి రెండు స్టార్ హీరోల ప్రాజెక్ట్స్ తో సోషల్ మీడియాలో హడావిడి మొదలు పెట్టింది. రెట్రో సినిమాలో వింటేజ్ లుక్ లో పూజ హెగ్డే చీరకట్టుతో అద్దరగొట్టేసింది
కానీ రెట్రో రిజల్ట్ తో పూజ హెగ్డే మరోసారి డిజప్పాయింట్ అయ్యింది. నిన్న మే 1 న విడుదలైన రెట్రో చిత్రంపై ప్రేక్షకులు ఇస్తోన్న టాక్ చూస్తే పూజ హెగ్డే ఖాతాలో మరో ప్లాప్ పడినట్లే అనిపిస్తుంది. రుక్మిణి పాత్రలో లుక్స్ విషయంలో పెరఫార్మన్స్ విషయంలో పూజ హెగ్డే కు వంక పెట్టడానికి లేదు, కానీ ఆ సినిమా రిజల్ట్ అమ్మడు ని బాగా ఇబ్బంది పెట్టేసింది.
ఈ ఏడాది హిందీలో దేవాతో ప్లాప్ అందుకున్న పూజ హెగ్డే కు సూర్య కూడా అదే రకమమైన రిజల్ట్ ని అందించడం చూస్తే పాపం బుట్టబొమ్మ పూజ హెగ్డే అంటూ నెటిజెన్స్ కామెంట్లు పెడుతున్నారు.