అమరావతి నేడు బిగ్ డే. అమరావతి రాజధాని పునర్నిర్మాణ కార్యక్రమం అమరావతి వేదికగా అంగరంగ వైభవంగా మొదలైంది. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిధిగా విచ్చేసిన నరేంద్ర మోడీకి గన్నవరం ఎయిర్ పోర్ట్ లో స్వాగతం పలికేందుకు రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు, హోంమంత్రి వంగలపూడి అనిత, రెవిన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తదితరులు తరలివచ్చారు.
ఇక ప్రధాని మోడీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ తదితరులు ఆశీనులైన అమరావతి పనుల పునః ప్రారంభ వేదికపై మినిస్టర్ నారా లోకేష్ మాస్ స్పీచ్ అందరిని ఆకట్టుకుంది. నమో(పీఎం మోడీ)కు మన అమరావతి అంటే ఎంతో ప్రేమ. నమో ఢిల్లీలో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ, మన అమరావతి కోసం వచ్చారు. ఆయన ఏపీకి కావాల్సినవన్నీ అందిస్తున్నారు, కోరిన కోర్కెలు తీర్చుతున్నారు. మొన్ననే విశాఖపట్నం వచ్చి రైల్వే జోన్, ఎన్టీపీసీ, నక్కపల్లి డ్రగ్ పార్క్ కు నిధులు కేటాయించారు.
అంతేకాదు నారా లోకేష్ మట్లాడుతూ.. రీసెంట్ గా పాకిస్తాన్ ఉగ్రవాదులు పహల్గామ్ ఉగ్రదాడి కి నిరసనగా సంతాపం తెలియజేసిన లోకేష్.. 100 పాకిస్థాన్ లు వచ్చినా, దీటుగా బదులిచ్చేందుకు మన వద్ద ఒక్క మిస్సైల్ ఉంది... ఆ మిస్సైల్ పేరు నమో (మోడీ) అంటూ లోకేష్ మట్లాడారు. పాకిస్తాన్ వాళ్లు భారతగడ్డపై గడ్డి మొక్క కూడా పీకలేరు. సింహం ముందు ఆటలు ఆడకూడదు, ఆడితే ఏమవుతుంది, మన నమో దెబ్బకు వరల్డ్ మ్యాప్ నుంచి పాకిస్థాన్ మిస్సింగ్ కావడం ఖాయం. యావత్ దేశం మన నమో వెంట నిలుస్తోంది అంటూ నారా లోకేష్ అమరావతి పునర్నిర్మాణ వేదికపై మోడీ పై చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.