పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు మౌనం వీడేనా, అసలు హరి హర వీరమల్లు విడుదలయ్యేనా, పోలవరం ప్రాజెక్ట్ కూడా ఫినిష్ అవుతుంది కానీ, హరి హర వీరమల్లు రిలీజ్ మాత్రం రిలీజ్ అవ్వడం లేదు అంటూ సోషల్ మీడియాలో వస్తున్న మీమ్స్ చూసి పవన్ ఫ్యాన్స్ హార్ట్ అవుతున్నారు. కానీ మేకర్స్ మౌనం వీడడం లేదు.
వీరమల్లు మేకర్స్ మాత్రం ఏం చేస్తారు పవన్ కళ్యాణ్ కాస్త సహాకరిస్తే సినిమా బయటపడిపోతుంది. కానీ పవన్ రాక అలా అలా వెనక్కి పోతూనే ఉంది. మే 9 వీరమల్లు రిలీజ్ అన్నారు. మే వచ్చేసింది.. హరి హర వీరమల్లు కొత్త డేట్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. అటునుంచి చప్పుడు లేదు.
మే చివరి వారానికైనా వీరమల్లు పూర్తవుతుందా, అప్పుడు డేట్ ఇచ్చినా సక్రమంగా రిలీజ్ చెయ్యగలుగుతారా అనేది అందరిలో అనుమానం, పవన్ అభిమానులు మాత్రం వీరమల్లు మౌనం వీడు అంటూ వేడుకుంటున్నారు. చూద్దాం మేకర్స్ ఏ డేట్ వీరమల్లు కోసం ఫైనల్ చేస్తారో అనేది.