సమ్మర్ హాలిడేస్ మొదలయ్యాయి. కానీ బాక్సాఫీసు దగ్గర అద్భుతమైన సినిమాలేవీ రావడంలేదు. భారీ బడ్జెట్ సినిమాలెలాగూ లేవు. కనీసం మీడియం రేంజ్ హీరోలైనా ఈ వేసవికి బోణి కొట్టకపోతారా అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. కానీ ఏప్రిల్ నెల మొత్తం బాక్సాఫీసు బోసురుమంది. చిన్న సినిమాలు బాక్సాఫీసుపై దాడి చేసాయి. సారంగపాణి లాంటి చిన్న చిత్రం తప్ప మరేది ఆడియన్స్ ను ఆకట్టుకోలేదు.
కానీ ఈ సమ్మర్ కి హీరో నాని బోణి కొట్టాడు. అనుకున్నట్టే హిట్ 3 తో మోత మోగించాడు. ఆడియన్స్ ను థియేటర్స్ కి రప్పించాడు. కొన్నేళ్లుగా ప్లాపనే పదానికి దూరంగా జరిగిన నాని హిట్ 3 తో మంచి హిట్ కొట్టడమే కాదు ప్రమోషన్స్ తో ఆడియన్స్ ను థియేటర్స్ కి కదిలించాడు. హిట్ 3 ఓపెనింగ్స్ తోనే తన కెరీర్ లో రికార్డ్ కలెక్షన్స్ నమోదు చేసాడు.
అర్జున్ సర్కార్ గా నాని ఊచకోత కోశాడు, హిట్ 3 అనే కన్నా మటన్ కొట్టు మస్తాన్ అంటే బావుండేదేమో అని ప్రేక్షకులు సరదాగా మాట్లాడినా యాక్షన్ తో కేక పెట్టించాడు. పవర్ ఫుల్ డైలాగ్స్ తో అద్దరగొట్టేసాడు. శైలేష్ కొలను తో కలిసి హిట్ ఫ్రాంచైజీని వేరే లెవల్ కి తీసుకెళ్లాడు నాని.
హిట్ 3 లో ప్రీ ఇంటర్వెల్, ప్రీ క్లైమాక్స్ సినిమాని నిలబెట్టాయి. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఆ రెండు గురించే మాట్లాడుకుంటున్నారు అంటే అవి ఎంతగా కనెక్ట్ అయ్యాయో అర్ధమవుతుంది. మరి సమ్మర్ లో ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ కొరతని నాని హిట్ 3 కొంతమేర తీర్చింది అనే చెప్పాలి.