Advertisementt

అఖండ 2పై క్రేజీ అప్ డేట్

Wed 23rd Apr 2025 01:07 PM
akhanda  అఖండ 2పై క్రేజీ అప్ డేట్
Crazy update on Akhanda 2 అఖండ 2పై క్రేజీ అప్ డేట్
Advertisement
Ads by CJ

నందమూరి బాలకృష్ణ తన హ్యాట్రిక్ దర్శకుడు బోయపాటి తో కలిసి అఖండ 2 చిత్రాన్ని స్టార్ట్ చేసారు. అఖండ కు సీక్వెల్ గా తెరకెక్కుతున్న అఖండ 2 పై విపరీతమైన క్రేజ్ మాత్రమే కాదు ట్రేడ్ లోను అంచనాలున్నాయి. ఎందుకంటే బోయపాటి-బాలయ్య కాంబోలో హ్యాట్రిక్ హిట్స్ నమోదు కావడం, అఖండ అద్భుతమైన హిట్ అవడం అన్ని అఖండ 2 పై అంచనాలు పెంచుతున్నాయి. 

హై ఓల్టేజ్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న అఖండ 2 కోసం టీమ్ విదేశాలకు పయనమవుతుంది. బాలకృష్ణ, ఇంకా విలన్స్ గా కనిపించబోతున్న నటులతో పాటు బోయపాటి జార్జియా దేశానికి పయనమవుతున్నారు. అక్కడ ఓ యక్షన్ ఎపిసోడ్ చిత్రీకరణ చేపట్టనున్నారని తెలుస్తుంది. 

జార్జియా దేశంలోని కొంతమంది జూనియర్ ఆర్టిస్టులతో బాలయ్య పై మాస్ యాక్షన్ ఎపిసోడ్ ని బోయపాటి తెరకెక్కిస్తారని.. ఈ షెడ్యూల్ దాదాపుగా 20 డేస్ పైనే ఉంటుంది అని తెలుస్తుంది. ప్రస్తుతం బోయపాటి కూల్ గా షూటింగ్ చేసుకుంటున్నారు. అయితే అఖండ 2 చిత్రం దసరా రిలీజ్ అన్నప్పటికీ.. అది వచ్చే ఏడాది సంక్రాంతి రేస్ లోకి షిఫ్ట్ అవుతున్నట్లుగా వార్తలొస్తున్నాయి. చూద్దాం బాలయ్య బర్త్ డే కి బోయపాటి ఎలాంటి ట్విస్ట్ ఇస్తారో అనేది. 

Crazy update on Akhanda 2:

Akhanda 2 Team is flying to Georgia next month

Tags:   AKHANDA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ