PMJ అంటే P ప్రిన్స్ M మహేష్ J జ్యువలరీ అని అనుకుంటున్నారు సోషల్ మీడియా లో నెటిజెన్స్. దేనికి కారణం లేకపోలేదు. రీసెంట్గా మహేష్ కూతురు సితార తో కలిసి చేసిన PMJ యాడ్ వైరల్ అవ్వటం, ఫాన్స్ వాళ్ళు ఇద్దరు కలసి క్యూట్ గా ఉన్నఫోటో DB లుగా పెట్టుకోవటం, PMJ AD ప్రమోట్ చేయటంలో మహేష్ బాబు కుటుంబం విస్తృతంగా యాడ్స్ లో నటిస్తూ భారీ హోర్డింగ్స్ లో కనిపించటమే కారణం. కానీ మహేష్ బాబు కి PMJ సంస్థకు ఎలాంటి సంబంధం లేదు.
ఈ కంపెనీని మొదట శ్రీ పి. మనోహర్‌లాల్ జైన్ 1964లో స్థాపించారు. పిఎంజె జ్యువెల్స్‌ను ప్రస్తుతం జైన్ కుటుంబంలోని మూడవ తరం నిర్వహిస్తోంది, కుశాల్ కుమార్ జైన్ చైర్మన్‌గా ఉన్నారు. శ్రీ పి. మనోహర్‌లాల్ జైన్ (PMJ) 1964 లో పిఎంజె జ్యువెల్స్‌కు పునాది వేసినప్పుడు ఆయన దార్శనికత ఏమిటంటే, వారి క్లయింట్ల కోసం ప్రపంచ స్థాయి ఆభరణాలను ఉత్పత్తి చేయడమే. ఇప్పుడు పిఎంజె జ్యువెల్స్ 3వ తరం నిర్వహిస్తున్న నగల పరిశ్రమలో 6 అద్భుతమైన దశాబ్దాలను జరుపుకుంది. 1964 నుండి మంచి నగలను కస్టమర్ లకు అందిస్తూ వారితో మంచి సంబంధాలను ఏర్పరుచుకుంటూ, పిఎంజె జ్యువెల్స్ భారతదేశం అంతటా మరియు యుఎస్ఎలో అనేక బ్రాంచ్ లు కలిగి, అందరి గౌరవాన్ని పొందింది అంటున్నారు నిర్వాహకులు.
ఈ రోజు పంజాగుట్టలో PMJ జువలర్స్ షోరూం ఘనంగా ప్రారంభోత్సవం జరిగింది. మహేష్ బాబు కూతురు సితారా చేతుల మీదుగా ఈ కార్యక్రమం నిర్వహించారు.