Advertisementt

స్త్రీ2 నిర్మాత‌ల క్రేజీ బ‌యోపిక్‌

Mon 21st Apr 2025 04:06 PM
stree 2  స్త్రీ2 నిర్మాత‌ల క్రేజీ బ‌యోపిక్‌
Crazy biopic from the producers of Stree 2 స్త్రీ2 నిర్మాత‌ల క్రేజీ బ‌యోపిక్‌
Advertisement
Ads by CJ

ప్ర‌తిభావంతుడైన రాజ్ కుమార్ రావు త‌దుప‌రి ఓ క్రేజీ బ‌యోపిక్ కోసం చ‌ర్చ‌లు జ‌రుపుతున్నాడు. స్త్రీ 2 నిర్మాత దినేష్ విజ‌న్ ఈ చిత్రానికి నిర్మాత‌. అయితే ఈ బ‌యోపిక్ లో న‌టించాల‌ని అమీర్ ఖాన్ చాలా కాలంగా ఉవ్విళ్లూరుతున్నాడు. కానీ క్రియేటివ్ డిఫ‌రెన్సెస్ కార‌ణంగా అత‌డు త‌ప్పుకోగా, ఆ పాత్ర‌లో రాజ్ కుమార్ రావు న‌టిస్తార‌నేది ప్రచారం. అయితే దినేష్ తో క‌లిసి అమీర్ ఖాన్ పెట్టుబ‌డుల్ని స‌మ‌కూరుస్తారు. అమీర్ న‌ట‌న నుంచి మాత్ర‌మే వైదొలిగాడు.

ఇది ఉజ్వ‌ల్ నిక‌మ్ అనే ప్ర‌ముఖ ప్రాసిక్యూట‌ర్ బ‌యోపిక్. కోర్ట్ రూమ్ డ్రామా నేప‌థ్యంలో ఆద్యంతం ర‌క్తి క‌ట్టిస్తుంద‌ని చెబుతున్నారు. ఈ సినిమాను 2024 లో ప్రారంభించాలనే ఆలోచన ఉంది. ఈ సంవత్సరం చివరి నుండి కాస్టింగ్ కాల్స్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని స‌మాచారం. ఆమిర్ ఈ బయోపిక్ లో న‌టించాల‌ని అనుకున్నా కానీ వీలుప‌డ‌టం లేద‌ని స‌మాచారం. ఇందులో అమీర్ ఖాన్ న‌టిస్తారా లేక రాజ్ కుమార్ రావు ఫైన‌ల్ అయ్యారా? అనేదానికి ఇంకా అధికారికంగా స‌మాచారం లేదు.

Crazy biopic from the producers of Stree 2:

Stree 2 producers announce new movie

Tags:   STREE 2
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ