Advertisementt

న‌టి డ్రైవ‌ర్ లెస్ కార్ జ‌ర్నీ

Mon 21st Apr 2025 04:11 PM
sofia chaudhry  న‌టి డ్రైవ‌ర్ లెస్ కార్ జ‌ర్నీ
Sofia Chaudhry న‌టి డ్రైవ‌ర్ లెస్ కార్ జ‌ర్నీ
Advertisement
Ads by CJ

ఎంటీవీ వీజే, పాపుల‌ర్ బాలీవుడ్ న‌టి సోఫీ చౌద‌రి డ్రైవ‌ర్ లేని కార్ లో ప్ర‌యాణించిన వీడియో వైర‌ల్ గా మారింది. అమెరికా శాన్ ఫ్రాన్సిస్కో రోడ్ ల‌లో ఈ కార్ ర‌య్ మంటూ దూసుకెళుతుంటే చాలా డౌట్లు పుట్టుకొచ్చాయి. అస‌లు డ్రైవ‌ర్ లేకుండా ఇంత సులువుగా ల‌గ్జ‌రీ ఎస్.యు.వి కార్ బిజీ రోడ్స్ లో ఎలా వెళ్ల‌గ‌లుగుతోంది?  ప్ర‌మాదాలు ఏవీ జ‌ర‌గ‌వా? అనే డౌట్లు చూప‌రుల‌కు పుట్టుకొచ్చాయి.

కానీ అలాంటి స‌మ‌స్య‌లేవీ లేకుండా ఈ కార్ రోడ్ పై దూసుకెళుతోంది. సోఫీ ఈ కార్ లో ప్ర‌యాణిస్తున్నా ఇంకా చిన్న‌పాటి డౌట్లు ఉన్నాయ్ అని అప‌న‌మ్మ‌కం వ్య‌క్తం చేసింది స‌ర‌దాగా న‌వ్వేస్తూనే. అధునాత‌న సాంకేతిక‌త అంత‌కంత‌కు ఉద్యోగాల కోత‌కు కార‌ణ‌మ‌వుతోంది. మునుముందు డ్రైవింగ్ జాబ్స్ కి ఎస‌రు పెట్ట‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. డ్రైవ‌ర్ అవ‌స‌రం లేని కార్ల‌ను టెస్లా కంపెనీ ఉత్ప‌త్తి చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఏఐ- చాట్ జీపీటీ సాంకేతిక‌త కార‌ణంగా ల‌క్ష‌లాది మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. చాలా మంది ఐటీ ఉద్యోగులు రోడ్ల‌పైకి వ‌చ్చే ప‌రిస్థితి ఉంద‌ని అధ్య‌య‌నాలు చెబుతున్నాయి. ఇత‌ర రంగాల‌పైనా ఏఐ ప్ర‌భావం ప‌డ‌బోతోంద‌ని స‌మాచారం. అయితే కంటెంట్ రైటింగ్‌లో `ఒరిజిన‌ల్ కంటెంట్ రైట‌ర్లు` మాత్రం మిగులుతార‌నే విశ్లేష‌ణ‌లు వెలువ‌డుతున్నాయి.

Sofia Chaudhry:

Sofia Chaudhry

Tags:   SOFIA CHAUDHRY
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ