హీరో రాజ్ తరుణ్-లావణ్య ల వ్యవహారం మరోసారి మీడియాలో హైలెట్ అవుతుంది. గత ఏడాది మొదలైన రాజ్ తరుణ్-లావణ్య కేసుల వ్యవహారం లావణ్య రాజ్ తరుణ్ కి సారీ చెప్పడంతో ముగిసింది అనుకుంటే.. మరోసారి లావణ్య రాజ్ తరుణ్ పై ఆగ్రహం వ్యక్తం చెయ్యడమే కాదు.. శేఖర్ బాషా, రాజ్ తరుణ్ తనని చంపేస్తారు, తనకి రక్షణ ఇవ్వమని పోలీసులను వేడుకుంటుంది.
రెండు రోజులక్రితం రాజ్ తరుణ్ పేరెంట్స్ రాజ్ తరుణ్ పేరుమీదన్న కోకాపేట విల్లా దగ్గరకు వెళ్లగా అక్కడ నివాసముంటున్న లావణ్య వారిని ఇంట్లోకి రానివ్వకుండా చెయ్యడంతో వారు ఆమెపై దాడికి తెగ బడ్డారు, తనపై చెయ్యి చేసుకున్నారు.. రాజ్ తరుణ్ ఫ్రెండ్ శేఖర్ బాషా ఆడదాని వేషంలో వచ్చి తనపై దాడి చేసాడు అంటూ ఆరోపణలు చేసిన లావణ్య నేడు నార్సింగి పోలీస్ స్టేషన్ కి వెళ్ళింది.
నిన్న శుక్రవారం రాత్రి కూడా కొంత మంది తన ఇంటికి వచ్చి దాడి చేసే ప్రయత్నం చేశారని లావణ్య నార్సింగి పోలీస్ లకు ఫిర్యాదు చేసింది. రాజ్ తరుణ్, అతడి తల్లితండ్రుల మీద ఫిర్యాదు చేస్తే పోలీసులు పట్టించుకోవడం లేదని ఆమె ఆరోపిస్తుంది. రాజ్ తరుణ్, శేఖర్ బాషా తనని చంపేస్తారు అంటోంది. రాజ్ కి మీడియా వేదికగా కాళ్లు పట్టుకుని క్షమాపణలు చెబుతున్నాను అన్నాను, కానీ సమస్య పరిష్కారం కాలేదు.
పోలీసులు న్యాయం చేయకపోతే పోలీస్ స్టేషన్ ముందే ప్రాణాలు విడుస్తానని.. తనకు ప్రాణహాని ఉందని చెప్పినా న్యాయం చేయడం లేదు అని లావణ్య ఆరోపిస్తుంది.