సమంత క్రిస్టియన్ అయినప్పటికి ఆమెకు హిందూ దేవుళ్లపై వల్లమాలిన భక్తి. ఆమె తరచూ శ్రీవేంకటేశుని సన్నిధికి మెట్ల మార్గం ద్వారా వెళ్లి శ్రీవారిని దర్శించుకుంటుంది. అలాగే పద్మావతి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంది. ప్రస్తుతం ముంబైలోనే ఎక్కువగా ఉంటున్న సమంత ఇక్కడ తెలుగులో నిర్మాతగా చేసిన తన తొలి సినిమాని విడుదలకు సిద్ధం చేసింది.
ఆమె నిర్మాతగా తెరకెక్కిన శుభం చిత్రం మే 9 న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా సమంత శుభం చిత్ర నటినటులతో కలిసి శ్రీవారిని దర్శించుకుంది. ఈరోజు ఉదయం వివిఐపి దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
అనంతరం సమంతకు శుభం చిత్ర యూనిట్ కు రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించారు .