గ్లామర్ ఇండస్ట్రీలో డేటింగ్, పెళ్లి బ్రేకప్ వ్యవహారాలు నిత్యం చూసేవే. ఇక్కడ స్వేచ్ఛా జీవనం పర్యవసానం ప్రత్యక్షంగా అనుభవిస్తారు. ఎవరికి వారు స్వేచ్ఛను కోరుకున్నప్పుడు బంధం విలువ పలుచనైపోయింది. అందుకే ఏదో ఒక మూల విడాకుల గురించి వినాల్సి వస్తోంది. ఇటీవల ప్రముఖ క్రికెటర్ నుంచి విడిపోయిన నటి (విదేశీయురాలు) ప్రస్తుతం ఒంటరి జీవనం సాగిస్తోంది.
అయితే ఈ నటి భర్త నుంచి బ్రేకప్ తర్వాత స్నేహితుడితో చనువుగా ఉంటోందని మీడియాలో కథనాలొచ్చాయి. అతడు ప్రముఖ సెలబ్రిటీ ఫిట్నెస్ ట్రైనర్. పైగా మోడల్. ఆ క్రికెటర్ కంటే ఎంతో అందగాడు. అందుకే ఆ ఇద్దరికీ లింకప్ పెడుతూ వార్తలు వెలువడ్డాయి. అయితే ఆ ఇద్దరి మధ్యా ఉన్నది కేవలం స్నేహమేనా? అంతకుమించి ఇంకేదైనా ఉందా? అనేదానికి ఎలాంటి ఆధారాలు లేవు. అయినా పుకార్లు మాత్రం ఆగలేదు. ఇప్పటికీ ఆ మోడల్ కం ఫిట్నెస్ కోచ్ తో ముడిపెడుతూ ముంబై మీడియా కథనాలు వండి వారుస్తోంది.
ప్రస్తుతం ఈ బ్యూటీ తన స్వేచ్ఛా జీవనానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాల్లో షేర్ చేస్తుంటే అవి వైరల్ గా మారుతున్నాయి. తాజా పోస్ట్ లో స్విమ్ సూట్‌లో ప్రత్యక్షమై గుబులు రేపుతోంది. క్రికెటర్ నుంచి విడిపోయాక, టూమచ్ గా చెలరేగుతోందని, స్వేచ్ఛాజీవనం కోసమే విడాకులిచ్చిందని నెటిజనులు ఘాటుగా మరోసారి కామెంట్ చేస్తున్నారు.