రేపు గురువారం అంటే ఏప్రిల్ 10 న ఆడియన్స్ ముందుకు రాబోతున్న రెండు పెద్ద చిత్రాలు అసలు విడుదలవుతున్నాయో లేదో అనే అనుమానంలో చాలామంది కనబడుతున్నారు. డబ్బింగ్ చిత్రాలే అయినా.. టాలీవుడ్ తో కనెక్షన్ ఉన్న సినిమాలు కావడం ఇక్కడ గమనించాల్సిన విషయం. టాలీవుడ్ లో ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మించిన రెండు చిత్రాలు అసలు న్యూస్లో కనిపించడం లేదు.
చిన్న చిన్న చిత్రాలైతే చెప్పుకోవక్కర్లేదు. అజిత్ లాంటి పెద్ద స్టార్ నటించిన చిత్రం, అలాగే టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లో ఒకరైన గోపీచంద్ డైరెక్ట్ చేసిన చిత్రము, రెండూ రెండే అన్నట్టుగా ఉంది పరిస్థితి. అజిత్ తో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన గుడ్ బ్యాడ్ అగ్లీ ఏప్రిల్ 10 న విడుదల అన్నారు. కానీ ఎలాంటి సందడి లేదు. అజిత్-త్రిష చిన్న స్టార్స్ కాదు, హీరోలు కోపరేట్ చెయ్యకపోయినా నిర్మాణ సంస్థ అయినా పూనుకుని ప్రమోషన్స్ చెయ్యాలి. కానీ గాలికొదిలేశారు.
ఇక గోపీచంద్ మలినేని హిందీ హీరో సన్నీ డియోల్ తో చేసిన జాట్ కూడా రేపు విడుదలకాబోతుంది. తెలుగు దర్శకుడు, తెలుగు నిర్మాతలు, అయినా తెలుగులో ఆదరణ లేదు. జాట్ రిలీజ్ ఏప్రిల్ 10 అని అన్నా ప్రమోషన్స్ లేవు, కనీసం ప్రెస్ మీట్ లేదు, మరేది లేకుండానే జాట్ విడుదలకు సిద్ధమైంది. తెలుగు వారు నిర్మాతలుగా, దర్శకులుగా ఉన్న డబ్బింగ్ చిత్రాల పరిస్థితి ఇది.
గుడ్ బ్యాడ్ అగ్లీ, జాట్ రెండూ రెండే. ఈ రెండు చిత్రాలకు మినిమమ్ ఓపెనింగ్స్ వస్తాయో, లేదో అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది.