కల్కి 2 పై నాగ్ అశ్విన్ క్రేజీ అప్ డేట్
Nag Ashwin crazy update on Kalki 2కల్కి 2898 AD చిత్రం గత ఏడాది జూన్ లో విడుదలై సెన్సేషనల్ హిట్ అయ్యింది. క్రేజీ నటులు ప్రభాస్, అమితాబ్, దీపిక కలయికలో నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ చిత్రం అభిమానులనే కాదు పాన్ ఇండియా ఆడియన్స్ ను కూడా ఇంప్రెస్స్ చేసింది. దానికి సీక్వెల్ గా కల్కి 2 అంటూ ప్రకటించారు, కానీ కల్కి 2 షూటింగ్ అసలు మొదలు పెట్టలేదు.
ప్రభాస్ రాజా సాబ్, అటు హను రాఘవపూడి మూవీ తో పాటుగా అతి త్వరలోనే ఆయన స్పిరిట్ మూవీ ని కూడా మొదలు పెట్టేందుకు రెడీ అవుతున్నారు. అయితే కల్కి 2 ఏప్రిల్ నుంచి ఉంటుంది అని ఆ మధ్యన నిర్మాత అశ్విని దత్ గారు సెలవిచ్చారు, కానీ కల్కి 2 షూటింగ్ ఇప్పుడప్పుడే మొదలయ్యేలా లేదు, అదే విషయాన్ని తిరుమలలో నాగ్ అశ్విన్ కూడా చెప్పారు.
ఈరోజు విఐపి బ్రేక్ దర్శన సమయంలో శ్రీవారి దర్శించుకుని బయటికి వచ్చిన నాగ్ అశ్విన్ ని మీడియా కల్కి 2 అప్ డేట్ గురించి అడిగారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్స్ జరుగుతున్నాయని, కల్కి 2 సెట్స్ పైకి వెళ్లడానికి చాలా టైమ్ పడుతుందని నాగ్ అశ్విన్ తెలపడంతో ప్రభాస్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Nag Ashwin gives an update on Kalki 2 at Tirumala







































