థియేటర్స్ లో మంచు బ్రదర్స్ వార్

ప్రస్తుతం బయట మంచు అన్నదమ్ములైన మంచు విష్ణు-మంచు మనోజ్ ల నడుమ పచ్చగడ్డి వేస్తె భగ్గుమంటుంది. మంచు వారి ఆస్తితగాదాలు తారాస్థాయిలో ఉన్నాయి. మీడియా కెక్కినా, పోలీస్ కేసులైనా మంచు అన్నదమ్ముల నడుమ సఖ్యత రాకపోగా.. రోజు రోజు కి ఆ గొడవలు ముదిరి పాకాన పడుతున్నాయి.

ఇప్పుడు బయట గొడవపడుతున్న మంచు బ్రదర్స్ మంచు విష్ణు - మంచు మనోజ్ లు థియేటర్స్ లో ఫైట్ కి దిగబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మంచు విష్ణు కన్నప్పపై రీసెంట్ గా మంచు మనోజ్ సెన్సేషనల్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 25 న విష్ణు కన్నప్ప థియేటర్స్ లో విడుదలవుతుంది.

అదే 25 న మంచు మనోజ్ నటిస్తున్న మినీ మల్టీస్టారర్ భైరవం చిత్రం విడుదల చేసేందుకు రెడీ అవుతున్నాడట. బెల్లంకొండ శ్రీనివాస్ తో మంచు మనోజ్ చేస్తున్న భైరవం చిత్రం విడుదలకు రెడీ అని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ చిత్రాన్ని మనోజ్ కన్నప్పపై దించాలనే ప్లాన్ లో ఉన్నట్లుగా చెప్పుకుంటున్నారు.

ఒకవేళ కన్నప్ప vs భైరవం అయితే అది సినిమాల నడుమ పోటీ కాదు, అన్నదమ్ముల మద్యన వార్ అనే చెప్పుకుంటారు. 

Vishnu Kannappa vs Manoj Bhairavam

Manchu Brothers War in theaters
kannappa