Advertisementt

కల్కి 2 ప్రభాస్ పాత్రపై క్రేజీ న్యూస్

Tue 18th Mar 2025 08:01 PM
kalki 2  కల్కి 2 ప్రభాస్ పాత్రపై క్రేజీ న్యూస్
Crazy news about Prabhas role in Kalki 2 కల్కి 2 ప్రభాస్ పాత్రపై క్రేజీ న్యూస్
Advertisement
Ads by CJ

కల్కి చిత్రంతో పాన్ ఇండియా లో 1100 కోట్లు కలెక్షన్స్ కొల్లగొట్టిన ప్రభాస్ ఎప్పడెప్పుడు కల్కి 2 సెట్ లోకి అడుగుపెడతారా అని ఆయన అభిమానులు ఎదురు చూడని రోజు లేదు. కానీ ప్రభాస్ కమిట్మెంట్స్ తో అది కాస్త లేట్ అవుతూ వస్తోంది. తాజాగా కల్కి దర్శకుడు నాగ్ అశ్విన్ ఎవడే సుబ్రహ్మణ్యం రీ రిలీజ్ ప్రెస్ మీట్ లో మీడియా కి దొరికారు. దానితో ఆయనకు కల్కి 2 పై ప్రశ్నలు ఎదురయ్యాయి. 

నాగ్ అశ్విన్ మీడియా అడిగిన ప్రశ్నలకు తెలివిగా ఆన్సర్ ఇచ్చారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. అసలు ప్రాజెక్ట్ K అంటే ఏమిటి అనే దగ్గరే ఆగిపోయాము, అది పూర్తయితే దానిని బట్టి షూటింగ్ మొదలు పెడతాము, కల్కి 2 లో ప్రభాస్ పాత్ర చాలా పెద్దది. ఈ ఏడాది చివరినాటికి కల్కి 2 తో సెట్స్ మీదకి వెళ్లేలా చూస్తాం. 

మహాభారత నేపధ్యాన్ని తీసుకుని సుమతి, అశ్వద్ధామ పాత్రలను సెట్ చేసుకుని కల్కి తో ఇక్కడివరకు వచ్చాం, పార్ట్ 2 లో భైరవ-కర్ణ యాంగిల్ లోనే కథ మొత్తం ఉంటుంది, దానికి సంబంధించి చాలా వర్క్ చెయ్యాల్సి ఉంటుంది. కల్కి 2 విడుదల తేదీపై ఇప్పుడే ఏమి చెప్పలేను అంటూ నాగ్ అశ్విన్ కల్కి 2 పై క్రేజీ అప్ డేట్ ఇచ్చారు. 

Crazy news about Prabhas role in Kalki 2:

Nag Ashwin reveals key updates on Kalki 2

Tags:   KALKI 2
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ