వైఎస్ ఫ్యామిలిలో ఆస్తి తగాదాలు రోజు రోజుకి రోడ్డున పడుతున్నాయి. ఆస్తి తగాదాల్లో వైఎస్ భార్య విజయమ్మ, కుమార్తె షర్మిల ఓ వైపు, జగన్ మాత్రమే ఓ వైపు నిలబడి పోరాడుతున్నారు. సరస్వతి పవర్ కంపెనీ షేర్ల విషయంలో వివాదం ముదిరి పాకాన పడింది.. ప్రస్తుతం ఈ వివాదం హైదరాబాద్ లోని నేషనల్ కంపెనీస్ లా ట్రిబ్యూనల్ కోర్టులో విచారణలో ఉంది.
ఈ కేసులో కాంప్రమైజ్ అవ్వడం కానీ, లేదంటే ఎవరో ఒకరు తగ్గడం కాని చెయ్యడం లేదు, ఎప్పటికప్పుడు ఇద్దరి తరుపున పిటిషన్స్ దాఖాలవుతున్నాయి. ఈ మధ్యన విజయమ్మ దాఖలు చేసిన పిటిషన్ లో అసలు కంపెనీలో జగన్ కు గా, ఆయన భార్య భారతికి గానీ వాటా లేదని ఆమె చెబుతున్నారు. కంపెనీకి చెందిన మొత్తం 99 శాతం షేర్లు తన పేరు మీదే ఉన్నాయని విజయమ్మ తన పిటిషన్ లో పేర్కొన్నారు.
కానీ జగన్ తన ప్రమేయం లేకుండా తన భార్య భారతి పేరుపై ఉన్న షేర్లను విజయమ్మ, షర్మిలలు వారి పేర్ల మీదకు మార్చుకున్నారని, అందువల్ల ఆ షేర్ల బదలాయింపును నిలిపివేయాలంటూ జగన్ పిటిషన్ వేశారు. మరి జగన్ అటు చెల్లిని, ఇటు తల్లిని మోసం చేస్తున్నాడంటూ విజయమ్మ, షర్మిల ఆరోపిస్తున్నారు. జగన్ కూడా తల్లి, చెల్లి మోసం చేసారంటూ సంచలన ఆరోపణలు చేస్తున్నారు.