షాకిచ్చే లుక్ లో శోభిత అక్కినేని

అక్కినేని ఇంట కోడలిగా, నాగ చైతన్య కు భార్యగా అడుగు పెట్టిన హీరోయిన్ శోభిత దూళిపాళ్ల అక్కినేని ఇంట ఏ ఫంక్షన్ అయినా, ఫెస్టివల్ అయినా కానీ జరిగినప్పుడు పద్దతిగా చీర కట్టులో కనిపించి కనువిందు చేస్తుంది. ఫ్యామిలీ పరంగా సాంప్రదాయంగా కనబడే శోభిత.. కెరీర్ విషయంలో మాత్రం చాలా ట్రెండీగా కనబడుతుంది. 

ఫ్యాషన్ ఐకాన్ గా కనిపించే శోభిత దూళిపాళ్ల తాజాగా ముంబైలో వైట్ షర్ట్ తో దర్శనమివ్వడమే కాదు, అదే రోజు సాయంత్రానికి కి శోభిత దూళిపాళ్ల టూ గ్లామర్ లుక్ లో షాకిచ్చింది. యానిమల్ ప్రింటెడ్ ట్రెండీ వేర్ లొ శోభిత అందాల ఆరబోత నిజంగా మతిపోవాల్సిందే. 

ఆ స్లీవ్ లెస్ టాప్ తో శోభిత రకరకాల భంగిమల్లో ఇచ్చిన ఫోజులు నిజంగా షాకిచ్చేలానే ఉన్నాయి. అక్కినేని వారి కొత్త కోడలు ట్రెండీ అవతార్ అంటుంటే.. అయ్యో పెళ్ళైన రెండు నెలలు కాకుండానే ఇంత గ్లామర్ ప్రదర్శన అవసరమా అంటూ దీర్ఘాలు తీస్తున్నారు కొందరు. 

Sobhita Dhulipala in a shocking look

Sobhita Akkineni in a shocking look
sobhita