ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Big Shot Goodbye to YCP.. into Janasena!

వైసీపీకి బిగ్ షాట్ గుడ్ బై.. జనసేనలోకి!

జనసేనలోకి బొత్స సత్యనారాయణ!?

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారా..? ఫ్యాన్ పార్టీలో పరిస్థితులు సరిగ్గా లేవని ఇక భవిషత్తు చూసుకోవడానికి రంగం సిద్ధం చేసుకున్నారా? ఫ్యాన్ నుంచి గ్లాస్ గుర్తు జనసేనలోకి చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారా..? అంటే వైసీపీలో తాజాగా నెలకొన్న పరిణామాలు ఇదే నిజమయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే పార్టీ ఓడిన తర్వాత బొత్స మునుపటిలా ఉత్సాహం, మునుపటిలా కనిపించడం లేదు. ఐతే ఎమ్మెల్సీగా గెలవడం, శాసన మండలి ప్రతిపక్ష నేతగా ప్రమోట్ చేయడంతో కాస్త యాక్టివ్ అయ్యారు.

మంచి సంబంధాలే..!

బొత్సకు పదవులు ఉన్నా, లేకున్నా.. అధికారం ఉన్నా లేకున్నా ఆయనకంటూ ఉన్న గుర్తింపు, నమ్ముకున్న జనం కోసమే పనిచేస్తూ వెళ్తారనే పేరుంది. దీనికితోడు వివాదాల జోలికి వెళ్లరు కూడా. నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి.. నేడు వైఎస్ జగన్ హయాంలో ఓ వెలుగు వెలిగిన నేత. ఏ పార్టీలో ఉన్నా అన్ని పార్టీల నేతలతో మంచి సంబంధాలే కొనసాగిస్తారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబుతోనూ మంచి సత్సంబంధాలే ఉన్నాయి. అలాగనీ బీజేపీతో లేవా అంటే అంతకు మించే ఉన్నాయి. ఈయన పార్టీ మారుతున్నట్లు తెలిస్తే కచ్చితంగా టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు పోటీ పడి మరీ తీసుకుంటాయి.

పవన్, బీజేపీ బంపరాఫర్..!

వాస్తవానికి ఎన్నికల ముందే బొత్సకు పవన్ సువర్ణ అవకాశమే ఇచ్చారు. పార్టీలోకి ఆహ్వానించి, కోరుకున్న సీట్లు, గెలిచాక మంచి పదవి, ఉమ్మడి విజయనగరం మొత్తం మీ గుప్పుట్లోనే పెట్టుకుని పార్టీని బలోపేతం చేయండి అని బొత్సకు పవన్ బంపరాఫర్ ఇచ్చారు. ఐతే తప్పకుండా వైసీపీ గెలుస్తుందని, ఇందులో ఎలాంటి సందేహాలు అక్కర్లేదని.. పార్టీ మారే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారట బొత్స. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక జనసేన నుంచి మళ్ళీ ఆఫర్ వచ్చిందని తెలిసింది. ఎందుకంటే కోస్తాంధ్రలో బలంగా ఉన్న పార్టీని ఉత్తరాంధ్రలోనూ బలోపేతం చేయడానికి బొత్స లాంటి సీనియర్లు ఉంటే మంచిదని పవన్ భావిస్తున్నట్టు సమాచారం. ఇటు బీజేపీ కూడా గట్టిగానే పట్టుబట్టినట్టుగా తెలిసింది. 

ఏం చేద్దాం..?

అటు జనసేనలోకి వెళ్ళాలా..? ఇటు బీజేపీలో చేరాలా? లేదంటే ఇక్కడే కొనసాగాలా? అనే డైలమాలో పడ్డారట. ఎందుకంటే బొత్సకు కుమారుడు ఉన్నారు. దీంతో భవిష్యత్ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళాలని ఫిక్స్ అయ్యారట. మరోవైపు సోదరుడు, బామ్మర్ది, భార్య ఝాన్సీ అంతా కీలకంగా ఉన్నారు. ఈయన ఎలా చెబితే అలానే ఉమ్మడి జిల్లా మొత్తం వింటుంది. ఉత్తరాంధ్ర మొత్తం కనుసన్నల్లోనే ఉంటుంది. ఒక్క రాజకీయంగానే కాదు.. ఆర్థికంగా కూడా బలమైన నేత. దీంతో బొత్సను పార్టీలోకి రమ్మని పవన్ ఆహ్వానించారని విశ్వసనీయ వర్గాల సమాచారం. మరోవైపు బొత్స ఇప్పటికిప్పుడు కాకపోయినా.. రానున్న రోజుల్లో పక్కాగా పవన్ సమక్షంలో పార్టీలో చేరే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఆయన అత్యంత సన్నిహితులు చెబుతున్న మాట. ఏం జరుగుతుందో.. బొత్స అడుగులు ఎటు పడతాయో చూడాలి మరి.

Botsa Satyanarayana joins the Jana Sena!

Big Shot Goodbye to YCP.. into Janasena!
botsa satyanarayana