ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Chandrababu is doing it with his hands!

చంద్రబాబు చేజేతులా చేసుకుంటున్నారే!

బాబుకు బ్రహ్మపదార్ధం కాస్త చెప్పు జగన్!

ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కొన్ని చేజేతులా చేసుకుంటూ అనవసరంగా ప్రజల్లో వ్యతిరేకత తెచ్చుకుంటున్నారనే మాటలు రాజకీయ విశ్లేషకుల నుంచి వస్తున్న పరిస్థితి. దీంతో జనాల్లో లేనిపోని విషయాలు అనుమానాలు, అపోహలకు ఆయనే అవకాశం ఇస్తున్నారు. ఇక వైసీపీ ఐతే ఈ వ్యవహారాన్ని ఎత్తి చూపుతూ, క్రెడిట్ కొట్టేస్తూ ప్రజల ముందు దోషిగా చూపిస్తున్న పరిస్థితి. ఇదే విషయం టీడీపీ కూటమి పార్టీల్లోనూ పెద్ద ఎత్తునే చర్చ నడుస్తోంది.

ఏమైంది విజనరీ..?

అదిగో వైసీపీ ఏపీని అప్పులపాలు చేస్తోంది.. ఇదిగో శ్రీలంక ఐపోతోంది.. కూటమి అధికారంలోకి వస్తే సంపద సృష్టిస్తా.. పేదలకు పంచుతా..! అని ఎన్నికల ప్రచారంలో ఎన్నిసార్లు చెప్పి ఉంటారో లెక్కే లేదు. అలాంటిది అధికారంలోకి వచ్చిన తరవాత ఇప్పటి వరకూ సూపర్ సిక్స్ హామీల అమలుపై పలుమార్లు చేతులు ఎత్తేసే మాటలు మాట్లాడారు. ఇది అందరికీ తెలిసిన విషయమే.. గుర్తుండే ఉంటుంది కూడా. ఐతే నీతి ఆయోగ్ రిపోర్టుపై సుదీర్ఘంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. పథకాలకు డబ్బుల్లేవు.. అమరావతి అభివృద్ధి కోసం కేంద్రం ఇచ్చిన నిధిని పథకాలకి ఖర్చుపెట్టలేం. డబ్బొచ్చాక పథకాల గురించి ఆలోచిస్తాం ఇదీ ఆయన చెప్పిన మాటలు. చూశారుగా మోకాలికి బోడి గుండుకు ముడిపెడుతూ.. సూపర్ సిక్స్ హామీలకు, వృద్ది రేటుకు లంకె పెట్టేశారు చంద్రబాబు.

కొత్తేమీ కాదుగా..!

ఈ ప్రకటనతో అటు ఐదు కోట్ల ఆంధ్రులు, ఇటు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తునే చర్చ జరుగుతోంది. చంద్రబాబు గురుంచి కొత్తగా చెప్పడానికి ఏముంది? ఎప్పుడూ మేనిఫెస్టోలో చెప్పిన విషయాలను అమలు చేయలేదనే పేరు ఉందని ప్రజలు, రాజకీయవర్గాల్లో, మేధావుల నోట నాటి నుంచి నేటి వరకూ అదే మాటలు వస్తున్నాయ్. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న చరిత్ర కాదని ఒకవైపు జనం కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐతే ఎంతసేపూ అభివృద్ధి మాత్రమే సంక్షేమం కూడా చూడాలనే డిమాండ్ అప్పటి నుంచి ఇప్పటి వరకూ నడుస్తున్నదే. ఇందుకు ఫలితనే 2019 ఎన్నికలు. అయినప్పటికీ చంద్రబాబు ఇప్పటికీ మారలేదు.

అటు పవన్.. ఇటు జగన్!

ఎట్టి పరిస్థితుల్లోనూ ఇచ్చిన హామీలను నెరవేర్చేలా చూసే భరోసా నాదీ అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెబుతున్న మాట. సమయం సందర్భం వచ్చినప్పుడు ఈ మాటే చెబుతుంటారు. ఇక వైసీపీ హయాంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఐతే మాట తప్పను.. మడమ తిప్పలేదనే పేరు ఉంది. అందుకే జగన్ ఐతే చెప్పాడంటే చేస్తాడంతే అని భరోసా ఉండిపోయింది. నాడు వైఎస్ జగన్ సీఎం అయ్యాక ఇప్పుడున్న దానికంటే ఎక్కువగానే అప్పులు ఉన్నాయ్. ఐతే ఏనాడూ ఇచ్చిన నవరత్నాలు పథకాలను అమలు చేసి చూపించారు. భారీ లోటు బడ్జెట్ అయినా, ఆర్థిక పరిస్థితి అంత బాగోలేకపోయినా బటన్ నొక్కుడు మాత్రం అమలు చేస్తూ.. అదికూడా నేరుగా లబ్దిదారుల అక్కౌంట్లలోకే, అందులోనూ ఎలాంటి అవినీతికి తావు లేకుండా పంపేవారు. నాడు జగన్ రెడ్డే ఇలా చేస్తే.. నేడు ఎందుకు చంద్రబాబు విజనరీ, 40 ఇయర్స్ ఇండస్ట్రీ ఏమైంది? అనే ప్రశ్నలు సామాన్యుడిలో వస్తున్న పరిస్థితి. ఆ బ్రహ్మపదార్ధాలు ఏమిటో కాస్త వైఎస్ జగన్ నుంచి తెలుసుకుంటే మంచిదేమో.. ప్రయత్నిస్తే పోయేది ఏముంది..!

Jagan-tell Babu some Brahmapadhardam!

Chandrababu is doing it with his hands!
chandrababu