Advertisementt

నటి కస్తూరికి బిగ్ రిలీఫ్

Thu 21st Nov 2024 11:48 AM
kasthuri  నటి కస్తూరికి బిగ్ రిలీఫ్
Big relief for actress Kasthuri నటి కస్తూరికి బిగ్ రిలీఫ్
Advertisement
Ads by CJ

రీసెంట్ గా అరెస్ట్ అయిన నటి కస్తూరి ప్రస్తుతం పుళల్‌ జైలులో 14 రోజుల రిమాండ్ లో ఉంది. త‌మిళ‌నాడులో తమిళ బ్రహ్మణ సమ్మేళనం నిర్వహించిన కార్యక్రమానికి హాజ‌రైన కస్తూరి తెలుగువారిపై అనుచిత వ్యాఖ్య‌లు చెయ్యడంతో ఆమెపై చెన్నై లో కేసులు నమోదు కావడంతో పోలీసులు ఆమెపై పలు సెక్షన్స్ కింద కేసు నమోదు చేసారు. 

ఆమెకు నోటీసులు ఇచ్చేందుకు వెళ్లడంతో.. కస్తూరి పోలిసుల కంట పడకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో పోలీసులు ఆమెని మొన్ననే అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా.. కోర్టు క‌స్తూరికి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. పుళల్‌ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉంది. అయితే కస్తూరి కోర్టులో బెయిల్ కి అప్లై చేసింది. 

తాను ఒంట‌రి త‌ల్లని, తనకు స్పెషల్ చైల్డ్ ఉందని, ఆ పాప బాగోగులు చూసుకోవాల‌ని కోర్టుకు విన్నవిస్తూ బెయిల్ కోరింది. ఇరు వర్గాల న్యాయవాదుల వాదోపవాదనలు విన్న ఎగ్మూర్ కోర్టు కస్తూరికి ప‌లు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రిమాండ్ లో ఉన్న క‌స్తూరికి బెయిల్ మంజూరు కావ‌డంతో ఆమె విడుద‌ల కానున్నారు. 

Big relief for actress Kasthuri:

Actor Kasthuri gets conditional bail in objectionable remarks case

Tags:   KASTHURI
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ