Advertisementt

ఆసుపత్రి నుంచి యాంకర్ స్రవంతి డిశ్చార్జ్

Thu 21st Nov 2024 11:25 AM
sravanthi chokarapu  ఆసుపత్రి నుంచి యాంకర్ స్రవంతి డిశ్చార్జ్
Anchor Sravanthi discharged from hospital ఆసుపత్రి నుంచి యాంకర్ స్రవంతి డిశ్చార్జ్
Advertisement
Ads by CJ

కొద్దిరోజుల క్రితం అనారోగ్య కారణాలతో ఆసుపత్రి పాలైన యాంకర్ స్రవంతి తాజాగా డిస్చార్జ్ అయ్యి ఇంటికి రావడమే కాదు.. ఆమె కార్తీక మాసంలో శివుడికి చెయ్యాల్సిన పూజలను తన ఇంట్లోనే చేసుకుంది. గత కొద్దిరోజులుగా యాంకర్ స్రవంతి విపరీతమైన బ్లీడింగ్ ప్రాబ్లెమ్ తో ఇబ్బంది పడి దానిని నెగ్లెట్ చెయ్యడం వలన ఆసుపత్రి పాలైంది. 

దానితో ఆమెకి చిన్నపాటి సర్జరీ నిర్వహించారు డాక్టర్స్. ఆ విషయాన్ని స్రవంతి తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తన అభిమానులతో పంచుకుంది. తాను షూటింగ్స్ లో బిజీ అంటూ ఆరోగ్యాన్ని పట్టించుకోకపోవడంతో ఇప్పడు ఇలా హాస్పిటల్ కి రావాల్సి వచ్చింది, మీరు నాలాగా ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయవద్దు అంటూ ఆమె ఆసుపత్రి బెడ్ పై ఉన్న ఫొటోస్ షేర్ చెయ్యడంతో ఆమె అభిమానులు ఆందోళన పడ్డారు. ఆమె కోలుకోవాలని దేవుడిని ప్రార్ధించారు. 

ఆమె కోలుకోవడంతో ఆసుపత్రి నుంచి తిరిగి ఇంటికి చేరుకుంది. ఇక ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటూ ఆమె పూజలు అవి చేసుకుంటున్న ఫొటోస్ షేర్ చేసింది. ఈ మద్యన స్రవంతి గ్లామర్ డాల్ లా మిగతా యాంకర్స్ కి గట్టి పోటీ ఇస్తూ తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంటూ కెరీర్ లో దూసుకుపోతుంది. 

Anchor Sravanthi discharged from hospital:

Anchor Sravanthi Chokarapu discharged from the hospital

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ