బిగ్ బాస్ 8: సూపర్ కూల్ లుక్ లో కింగ్ నాగ్

Sun 11th Aug 2024 07:19 PM
nagarjuna  బిగ్ బాస్ 8: సూపర్ కూల్ లుక్ లో కింగ్ నాగ్
Bigg Boss 8 new promo released బిగ్ బాస్ 8: సూపర్ కూల్ లుక్ లో కింగ్ నాగ్
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 8 మొదలు కావడానికి సమయం దగ్గరపడుతుంది. బిగ్ బాస్ యాజమాన్యం ఈ సీజన్ పై క్రేజ్ పెంచేందుకు రకరకాల ప్రయత్నాలు మొదలు పెట్టేసారు. బిగ్ బాస్ 8 లోగో ప్రోమో మాత్రమే కాదు.. హోస్ట్ నాగార్జున తో కలిసి స్పెషల్ ప్రోమోస్ వదులుతున్నారు. ఎంటెర్టైనెంట్ కి లిమిట్ లేదు అంటూ మొన్న ఒక ప్రోమో వదిలారు.,

ఇప్పుడు తాజాగా బిగ్ బాస్ సీజన్ 8 కి సంబందించిన మరో ప్రోమో వచ్చేసింది. ఏదైనా అన్ లిమిటెడ్ అంటూ కింగ్ నాగ్ చాలా స్టైలిష్ సూపర్ కూల్ లుక్ లో ఎంట్రీ ఇవ్వగా.. నాగ్-కమెడియన్ సత్య పై ప్రోమో కట్ చేసారు. తాను కోరుకున్న ఎంటెర్టైనెంట్న్ ఇస్తూ కమెడియన్ సత్య ని ఊపిరి ఆడకుండా డాన్స్ లతో,అమ్మాయిలతో ఉక్కిరిబిక్కిరి చెయ్యగా అది తట్టుకోలేని సత్య నాకు ఏకాంతం కావాలని కోరుకుంటాడు. నాగ్ ఆలోచించుకో అంటే ఐ వాంట్ ప్రైవసీ అంటాడు సత్య. 

అవునా తీసుకో.. ఏదైనా అన్ లిమిటెడ్ అన్న నాగార్జున సత్య ని ఏకాంతం కోసం ఎడారిలో వదిలెయ్యగా అక్కడ తన పరిస్థితి చూసుకుని భయంతో ఎవరైనా ఉన్నారా ప్లీజ్ అంటూ సత్య కేకలు పెడుతూ కనిపించడమే కాదు.. ఈసారి  బిగ్ బాస్ 8 లో ఎంటెర్టైనెంట్ కి, ఫన్ లకు, ట్విస్ట్ లకి కొదవే లేదు.. అంటూ నాగార్జున ఈ సీజన్ పై హైప్ క్రియేట్ చేస్తున్నారు. 

Bigg Boss 8 new promo released:

Nagarjuna Unleashes New Bigg Boss 8 Promo

Tags:   NAGARJUNA
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ