ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> A lot of changes have happened in Pushpa 2 !!

పుష్ప 2 లో చాలా మార్పులు జరిగాయ్ !!

అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో పుష్ప 1 పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అవడంతో పుష్ప 2 పై అంచనాలు పెరిగిపోయాయి. పుష్ప రాజ్ గా అల్లు అర్జున్ నేషనల్ అవార్డు గెలుచుకోవడం పుష్ప 2 కి మరింత హైప్ పెరిగేలా చేసింది. అందుకే సుకుమార్ కూడా పుష్ప రూల్ లో కొన్ని సన్నివేశాలు నచ్చకపోతే మొహమాటం లేకుండా రీ షూట్ చేస్తూ ఆలస్యం చెయ్యడంతో పుష్ప 2 ఆగష్టు 15 నుంచి డిసెంబర్ 6 కి పోస్ట్ ఫోన్ అయ్యింది. 

రీసెట్ గానే అల్లు అర్జున్ పుష్ప 2 సెట్స్ మీదకి వెళ్లగా.. సుకుమార్ అల్లు అర్జున్ ఇంకా కీలక నటులపై  క్లైమాక్స్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. గూస్ బంప్స్ తెప్పించే క్లైమాక్స్ పోరాటంలో పుష్ప 2 అంటూ మేకర్స్ అప్ డేట్ కూడా ఇచ్చారు. అయితే తాజాగా గీత ఆర్ట్స్ నిర్మాత బన్నీ వాస్ పుష్ప 2 పై చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. పుష్ప 2 లో చాలా మార్పులు జరిగాయి అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసాడు. 

పుష్ప సీక్వెల్ అనుకున్నప్పుడు.. సుకుమార్ చాలా ఆలోచించారు. స్టోరీ లో చాలా మార్పులు చేసారు, అందుకే షూటింగ్ ఆలస్యమవుతుంది. పుష్ప 1 బ్లాక్ బస్టర్ అంచనాలు అందుకోవాలంటే పుష్ప 2 లో అంతకు మించి ఉండాలి. అందుకే సినిమా లేట్ అయ్యింది. 

పుష్ప 2 లేట్ ప్రభావం అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీస్ పై పడింది. అల్లు అర్జున్ కొత్త చిత్రాలు ఆగష్టు లో ప్రకటించే అవకాశం ఉంది అంటూ బన్నీ వాస్ పుష్ప చిత్రంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి, ఎందుకు ఆలస్యమవుతుందో వివరించారు. 

Bunny Vas Talks About The Reason For Changes In Pushpa 2

A lot of changes have happened in Pushpa 2 !!
pushpa 2