Advertisementt

బాలయ్య ది వన్ మ్యాన్ షో

Wed 12th Jun 2024 08:04 PM
balakrishna  బాలయ్య ది వన్ మ్యాన్ షో
Balayya is being praised as a one man show బాలయ్య ది వన్ మ్యాన్ షో
Advertisement
Ads by CJ

ఈరోజు గన్నవరం ఎయిర్ పోర్ట్ సమీపంలో కేసరపల్లిలో జరిగిన చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమంలో నందమూరి బాలకృష అందరికన్నా ఎక్కువ హైలెట్ అయ్యారు. అంతా తానై, ఈ కార్యక్రమానికి వచ్చిన అతిధులను రిసీవ్ చేసుకోవటమే కాకుండా అక్కడ ఆయన తెగ సందడి చేసారు. 

సూపర్ స్టార్ రజనీకాంత్ దగ్గర నుంచి మెగాస్టార్ చిరంజీవి వరకు అందరికి షేక్ హాండ్స్ ఇస్తూ రిసీవ్ చేసుకుని వారికి కేటాయించిన సీట్ల లో కూర్చోబెట్టి, బాలయ్య కూడా రజిని దంపతుల వద్దే కూర్చున్నారు. తనకి మంత్రి పదవి దక్కకపోయినా రవ్వంత అసూయ లేకుండా, మంత్రి పదవులు వరించిన వారిని ఆప్యాయంగా కౌగిలించుకొని అందరితో కలిసి తిరగడం ఆయన అభిమానులని విశేషంగా కట్టుకుంది. 

సడన్ గా తన సోదరి భువనేశ్వరి దగ్గరకి వెళ్లి ఒక అన్నగా తల మీద చెయ్యి వేసి ఆశీర్వదించటం, అన్నా, చెల్లెల్ల బంధం అంటే  ఇలా ఉండాలంటూ సోషల్ మీడియాలో వైరల్ అవటం చూసాం, నారా లోకేష్ కూడా మామగారు అయిన బాలయ్య దగ్గర ఆశీస్సులు తీసుకోవటం అన్ని హైలెట్ అయ్యాయి. 

చివరగా నరేంద్ర మోడీ గారితో, అమిత్ షా గారితో, తమిళనాడు మాజీ సీఎం పన్నీర్ సెల్వమ్ గారితో ముచ్చటించటం బాలయ్య బాబు అభిమానులుకు ఎంతో కనులవిందుగా అనిపించడం కాదు.. వన్ మ్యాన్ షో అంటూ బాలయ్య అభిమానులు ఆయనని తెగ పొగిడేస్తున్నారు. 

Balayya is being praised as a one man show:

Fans are praising Balayya as a one man show

Tags:   BALAKRISHNA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ