Advertisementt

మెగా బ్ర‌ద‌ర్స్‌తో మోదీ.. దేనికి సంకేతం!

Wed 12th Jun 2024 07:18 PM
modi  మెగా బ్ర‌ద‌ర్స్‌తో మోదీ.. దేనికి సంకేతం!
Modi with Mega Brothers... ! మెగా బ్ర‌ద‌ర్స్‌తో మోదీ.. దేనికి సంకేతం!
Advertisement
Ads by CJ

మెగా బ్ర‌ద‌ర్స్‌తో మోదీ.. దేనికి సంకేతం!

నారా చంద్రబాబు నాయుడు అనే నేను... ప్రమాణ స్వీకారోత్సవంలో ఇంట్రెస్టింగ్ సీన్ అందరూ చూసే ఉంటారు. ప్రధాని నరేంద్ర మోదీ.. ఏపీ మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ చేయి పట్టి లాక్కొని మెగాస్టార్ చిరంజీవి దగ్గరికి స్వయంగా తీసుకెళ్లడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. అటు మీడియాలో.. ఇటు సోషల్ మీడియా ఇప్పుడిదే పెద్ద ఎత్తున నడుస్తోంది. మంత్రుల ప్రమాణ స్వీకారం తర్వాత.. జాతీయగీతంతో కార్యక్రమం ముగిసింది. ఇక అందరికీ అభివాదం చేసి మోదీ తిరుగు పయనం కావాలని సిద్ధం అవుతున్న క్రమంలో జనసేనానిని పలకరించగా.. ఆయన ఏదో చెవిలో చెప్పడం, వెంటనే పవన్ చేయి పట్టుకొని చిరు దగ్గరికి వెళ్ళడం.. ఇద్దరి చేతులు పైకి లేపి అదేనబ్బా మెగాస్టార్.. పవర్ స్టార్ మధ్యలో మోదీ..! ఈ సీన్ వేదికపై కనిపించింది. అంత పెద్ద మనిషి.. చిరును కలవడం, ప్రత్యేకించి ముగ్గురూ ఒకే వేదికపై, ఓకే ఫ్రేమ్ లో చూడటంతో అభిమానులు, కార్యకర్తలకు రెండు కళ్ళు సరిపోలేదు. 

ఏం నడుస్తోంది..?

ఈ సన్నివేశంతో ఎన్నో రకాలుగా వార్తలు గుప్పుమంటున్నాయి. వాస్తవానికి మోదీ వేదికపై నుంచి వెళ్తుండగా సర్.. మా అన్న కూడా ఇక్కడే ఉన్నారు అని మోదీకి పవన్ చెప్పినట్లు ఉన్నారు. అవునా.. పద కలుద్దాం అని సేనాని చేయి పట్టుకొని లాగుతూ చిరు దగ్గరికి వెళ్లి అభివాదం చేశారు. ఇంకాస్త గట్టిగా ఆలోచిస్తే.. తాను ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఉండటానికి, తనను ముందుకు నడిపించడానికి కర్త, కర్మ, క్రియ అన్నీ అన్నయ్య అని మోదీతో పవన్ చెప్పి ఉండొచ్చు. బహుశా.. ఇంతకు మించి అక్కడ జరిగిందేమీ లేదు. ఒక్క అభివాదం, కలిసి దిగిన ఓకే ఒక్క ఫోటోతో ఎన్నెన్ని రాతలు రాసేస్తున్నారో ఏంటో..!

ఆపండ్రా బాబోయ్..!

ఇంతకీ మోదీ కావాల‌నే ఇలా అభివాదం చేశారా..? భ‌విష్య‌త్‌లో తాము క‌లిసి న‌డిచేది మెగా బ్ర‌ద‌ర్స్‌తోనే   అని స్ప‌ష్ట‌మైన సంకేతాలు ఇచ్చారా..? అనే చ‌ర్చ ఎక్కడ చూసినా నడుస్తోంది. ఈ మధ్య చిరంజీవి మళ్ళీ రాజకీయాల్లోకి వస్తారని.. మళ్ళీ వేట మొదలు పెడతారని వార్తలు గుప్పుమన్న సంగతి తెలిసిందే. దీనికి తోడు వేదికపై స్వయంగా మోదీ చేసిన ఈ చర్య దీనికి మరింత బలం చేకూరినట్టు అయ్యింది. ఇలా ఒకటా రెండా ఎవరికి నచ్చింది వాళ్ళు.. ఎవరికీ తోచింది వాళ్ళు తెగ రాసేస్తున్నారు. వాస్తవానికి ఇప్పుడు పవన్ పదవి కంటే ఏపీ ప్రజలకు కూటమి ఇచ్చిన హామీలు ఆచరణలో పెట్టడం చాలా ముఖ్యం. దీనికి తోడు పార్టీని రానున్న ఎన్నికలకు సిద్ధం చేసి.. ఒంటరి పోరుకు కూడా రంగం సిద్ధం చేసుకోవాల్సి ఉంది. అందుకే తమ్ముడికి తోడు అన్నయ్య వచ్చినా.. పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదు అనుకుంటా.. మరి మెగాస్టార్ మనసులో ఏముందో వేచి చూడాల్సిందే..!

Modi with Mega Brothers... !:

Moment Of The Day: Modi Hypes Up Mega Brothers

Tags:   MODI
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ