అక్కినేని అఖిల్ ఏజెంట్ తో మాయమై ఏప్రిల్ వస్తే ఏడాది పూర్తవుతుంది. ఏజెంట్ తర్వాత ఒకటిరెండుసార్లు తప్ప అఖిల్ మళ్ళీ బయట కనిపించలేదు. ప్రస్తుతం CCL అంటూ సెలెబ్రిటీ క్రికెట్ కోసం రెడీ అయ్యాడు. సెలెబ్రిటీ క్రికెట్ లీగ్ పూర్తయ్యాక అఖిల్ తన నెక్స్ట్ మూవీ మొదలు పెట్టేందుకు సిద్దమవుతున్నాడనే న్యూస్ వినిపిస్తోంది. ఏజెంట్ డిసాస్టర్ తర్వాత అఖిల్ తన తదుపరి చిత్రం కోసం చాలా పెద్ద గ్యాప్ తీసుకున్నాడు. ఏజెంట్ తర్వాత తదుపరి మూవీని అనిల్ కుమార్ అనే కొత్త దర్శకుడితో అనుకుంటే.. అది లేట్ అవుతూ వస్తుంది.
ఇప్పుడు అఖిల్ అనిల్ కుమార్ తో మొదలు పెట్టబోయే మూవీని మార్చి రెండో వారం నుంచి సెట్స్ మీదకి తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నాడట. ఏజెంట్ తో ఫుల్ డిస్పాయింట్ అయిన అఖిల్ ఈసారి కొడితే సూపర్ హిట్ కొట్టాలనే కసితో బరిలోకి దిగబోతున్నాడట. మరి అనిల్ కుమార్ అయినా అఖిల్ కి సక్సెస్ అందిస్తాడో లేదో కానీ.. అక్కినేని అభిమానులు మాత్రం అఖిల్ నెక్స్ట్ పై చాలా ఇంట్రెస్టింగ్ గా ఎదురు చూస్తున్నారు.
ఎప్పుడెప్పుడు అఖిల్ శుభవార్త చెబుతాడా అని కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూడడం.. అది జరగకపోవడం గత ఆరు నెలలుగానే జరుగుతూనే ఉంది. మరి ఇప్పుడు ఆ తరుణం ఆసన్నమైనట్లే అనిపిస్తుంది.