పవన్ కళ్యాణ్ తో సినిమాలు చేసే దర్శకులంతా మరో సినిమాకి కమిట్ అవుతున్నట్లే.. పవన్ తో OG లాంటి క్రేజీ ప్యాన్ ఇండియా ఫిలిం చేస్తున్న సుజిత్ కూడా మరో హీరో తో సినిమా చేసుకోవడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు. కొద్దిరోజులుగా హీరో నాని తో సుజిత్ చిత్రం ఉంటుంది అనే ప్రచారానికి తెర దించుతూ. నేడు శనివారం హీరో నాని పుట్టిన రోజు సందర్భంగా దానయ్య నిర్మాతగా సుజిత్-నాని కాంబో మూవీ అనౌన్సమెంట్ ఇచ్చేసారు.
నాని తో దానయ్య ఇప్పటికే సరిపోదా శనివారం చేస్తున్నారు. ఈరోజు నాని బర్త్ డే కి స్పెషల్ గా సరిపోదా శనివారం చిత్రం నుంచి గ్లిమ్ప్స్ వదిలిన దానయ్య.. అదే నిర్మాణ సంస్థ నుంచి సుజిత్ తో #Nani32ని అనౌన్స్ చేసారు. జిత్ తో దానయ్య ఎంటర్టైన్మెంట్ లో సుజిత్ పవన్ కళ్యాణ్ తో OG చేస్తున్న విషయం తెలిసిందే. మరి సుజిత్ కూడా పవన్ వచ్చే వరకు ఖాళీగా ఉండిపోకుండా హరీష్ శంకర్, క్రిష్ మాదిరిగానే.. నాని తో సినిమా చెయ్యడానికి రెడీ అయ్యాడు. నాని-దానయ్య-సుజిత్ కాంబోలో #Nani32 అంటూ బిగ్గెస్ట్ అనౌన్సమెంట్ ఇచ్చేసారు.
#Nani32 ని 2025 లో రిలీజ్ చేస్తామని కూడా క్లారిటీ ఇచ్చారు. అలాగే సుజిత్ - పవన్ OG ని సెప్టెంబర్ లో విడుదల చేస్తామని ఇప్పటికే రిలీజ్ డేట్ లాక్ చేసి ప్రకటించారు.